Raghava Lawrence: 'శ్రీకారం' దర్శకుడితో రాఘవ లారెన్స్ తెలుగు సినిమా

ABN , Publish Date - Jul 24 , 2024 | 04:21 PM

తమిళ సినిమాలతో బిజీగా వున్న నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఇప్పుడు ఒక తెలుగు సినిమా చెయ్యడానికి సంసిద్ధం అవుతున్నారు. 'శ్రీకారం' దర్శకుడు బి కిషోర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని, హాస్య మూవీస్ నిర్మిస్తుందని తాజా సమాచారం

Raghava Lawrence

ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్ వరసగా సినిమాలు చెయ్యడానికి సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే రెండు సినిమాలు చిత్రీకరణ చేసుకుంటున్నాయి, ఇంకా మరికొన్ని సినిమాలని వరసగా లైనప్ లో వుంచాయని భోగట్టా. హాస్య మూవీస్ సంస్థ రాజేష్ దందా నిర్మాతగా 'బచ్చలమల్లి' సినిమా అల్లరి నరేష్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి, ఇపుడు పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది. ఇంకొక సినిమా 'మజాకా' కూడా చిత్రీకరణ దశలో వుంది. సందీప్ కిషన్, రావు రమేష్, అన్షు, రీతూ వర్మ ఇందులో ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వినోదభరితంగా ఉంటుందని అంటున్నారు. బెజవాడ ప్రసన్న కుమార్ కథని అందించగా, నక్కిన త్రినాథ రావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. (Rajesh Danda of Hasya Movies is planning to do a film with Raghava Lawrence and it is to be directed by B Kishore of 'Sreekaram' fame)

raghavalawrenceone.jpg

ఇదిలా ఉంటే ఇదే నిర్మాణ సంస్థ ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ తో ఒక సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ సినిమాకి 'శ్రీకారం' దర్శకుడు బి కిశోర్ దర్శకత్వం వహిస్తాడని కూడా తెలుస్తోంది. ఈ చిత్రం చెయ్యడానికి హాస్య మూవీస్ చెన్నై వెళ్లి లారెన్స్ తో మాట్లాడి వచ్చినట్టుగా కూడా సమాచారం. (Raghava Lawrence to do a Telugu film with 'Sreekaram' fame B Kishore as director)

లారెన్స్ కి కథ నచ్చి చెయ్యడానికి కూడా అంగీకారం తెలిపాడని కూడా ఒక వార్త వచ్చింది. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది అని అంటున్నారు. అందుకే లారెన్స్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. లారెన్స్ ఈమధ్య కాలంలో ఎక్కువగా తమిళ సినిమాలపైనే దృష్టి పెట్టాడు. ఇప్పుడు ఈ కథ నచ్చి తెలుగులో చెయ్యడానికి వొప్పుకున్నట్టుగా తెలిసింది. లారెన్స్ కి తమిళంలో కూడా మంచి పాపులారిటీ వుంది కాబట్టి, ఈ సినిమా తమిళంలో కూడా విడుదల చేస్తారని అంటున్నారు. హాస్య మూవీస్, ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరతో కలిసి చిత్రాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - Jul 24 , 2024 | 04:34 PM