PVR మల్టీఫ్లెక్స్ అదిరిపోయే ఆఫర్.. సినిమా పిచ్చోళ్లకు ఇక పండగే!
ABN , Publish Date - Mar 17 , 2024 | 01:57 PM
మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక యావత్ దేశంలోనే పేరెన్నికగన్న మల్టీప్లెక్స్ పీవీఆర్. నిత్యం సరికొత్త ఆఫర్లతో తమ రెగ్యులర్ కస్టమర్లకు మంచి సేవలందించడమే కాక కొత్త వారిని ఆకర్షించేందుకు వినూత్న ఐడియాలతో ఆకట్టుకుంటోంది.
మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక యావత్ దేశంలోనే పేరెన్నికగన్న మల్టీప్లెక్స్ ప్రాంఛైజీ సంస్థ పీవీఆర్. అంతర్జాతీయ సౌకర్యాలను ఇక్కడి ప్రజలకు అందజేస్తూ చేరువైంది. ఈ మధ్యే ఐనాక్స్‌ను కూడా వీలినం చేసుకుని పీవీఆర్ ఐనాక్స్‌గా మారిన ఈ మల్టీఫ్లెక్స్ దిగ్గజం నిత్యం సరికొత్త ఆఫర్లతో తమ రెగ్యులర్ కస్టమర్లకు మంచి సేవలందించడమే కాక కొత్త వారిని ఆకర్షించేందుకు వినూత్న ఐడియాలతో ముందుకెళుతూ ఆకట్టుకుంటోంది.
గతంలో నేషనల్ సినిమా డే. వరల్డ్ సినిమా డే అంటూ కొత్త ఆఫర్లతో తక్కువ ధరలకు టికెట్లను విక్రయించిన ఈ సంస్థ ఇప్పుడు పీవీఆర్ పాస్‌ఫోర్ట్ అంటూ (PVR Passport) మరో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. పీవీఆర్ ఐనాక్స్ పాస్‌ఫోర్ట్ జోన్ A, పాస్‌పోర్ట్ జోన్ B అంటూ కొత్త ప్యాకేజీలను తీసుకు వచ్చింది.
అయితే పాస్‌ఫోర్ట్ జోన్ A పూర్తిగా నార్త్ స్టేట్స్ కు వర్తిస్తుండగా పాస్‌పోర్ట్ జోన్ B (Passport Zone B)ని తెలంగాణ, ఆంద్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పాండిచ్చెరి రాష్ట్రాలకు ప్రత్యేకంగా వర్తింపజేస్తున్నారు. ఇందులోనూ రెండు రకాల ధరలతో ఈ ప్యాకేజీలు రెగ్యులర్ సినిమా లవర్స్‌కు మంచి బెనిఫిట్స్‌ను అందించనున్నాయి. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మన రెండు తెలుగు రాష్ట్రాలు పీవీఆర్ ఐనాక్స్ పాస్‌ఫోర్ట్ జోన్ B (PVR Passport Zone B) కిందకు వస్తుండగా (PVR Passport ) 1 ఖరీదు రూ.349 కాగా 30 రోజుల పాటు వ్యాలిడిటీతో నాలుగు సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. ఇక పీవీఆర్ ఐనాక్స్ పాస్‌ఫోర్ట్ 2 ఖరీదు రూ.1047 కాగా 90 రోజుల వ్యాలిడీటితో 12 చిత్రాలు చూసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫుడ్‌కు సంబంధించి రూ.350 కూపన్ ఇస్తారు. అయితే ఈ ఆఫర్ వీకెండ్స్ అయిన శుక్రవారం, శనివారం, ఆదివారాలలో పని చేయదు. సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ ఆఫర్ తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు ఆర్మూర్, వరంగల్ పట్టణాలలో, ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, విజయవాడ, కాకినాడ, కర్నూల్, నర్సీపట్నం, విశాఖపట్నం, విజయనగరం వంటి ప్రముఖ ప్రాంతాలలోని మల్టీఫ్లెక్స్‌లలోనూ చెల్లుబాటు అవనుంది. ఈ ఆఫర్ రెగ్యులర్ సీట్లకు వర్తిస్తుంది తప్పితే రీ క్లైనర్, లగ్జరీ, గోల్డ్ సీట్లకు పని చేయదు. ఒకవేళ ఆ సీట్లే కావలనుకుంటే అదనంగా రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ లేకుండా రెగ్యులర్ టికెట్ల రేట్లతోనూ సినిమాలు చూసేయవచ్చు. ముఖ్యంగా మీరు ఈ ఆఫర్ రిజిస్టర్ చేసుకునే ముందు కండీషన్స్ చెక్ చేసుకోవడం అసలు మరువద్దు.