పుష్ప 2 పారితోషికం రూ. 300 కోట్లు

ABN , Publish Date - Nov 27 , 2024 | 06:26 AM

ఇప్పటి వరకూ బాలీవుడ్‌ హీరోలే పారితోషికం విషయంలో టాప్‌ అనుకుంటున్న సమయంలో అల్లు అర్జున్‌ ఈ విషయంలో ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మంగళవారం ఫోర్బ్స్‌ ఇండియా..

ఇప్పటి వరకూ బాలీవుడ్‌ హీరోలే పారితోషికం విషయంలో టాప్‌ అనుకుంటున్న సమయంలో అల్లు అర్జున్‌ ఈ విషయంలో ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మంగళవారం ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్‌ దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్‌ 10 నటుల జాబితాను విడుదల చేసింది. ఇందులో ‘పుష్ప 2’ సినిమా కోసం రూ.300 కోట్లు తీసుకుంటున్న అల్లుఅర్జున్‌ ప్రధమ స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. రెండో స్థానంలో తమిళ కథానాయకుడు విజయ్‌ ఉన్నారు. ఆయన ‘లియో’, ‘గోట్‌’ చిత్రాలతో పాటు ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న ‘విజయ్‌ 69’ కోసం రూ. 275 కోట్లు తీసుకున్నారట. మూడో స్థానంలో ఉన్న షారుక్‌ ఖాన్‌ ‘డంకీ’ సినిమాకు రూ.150- 250 కోట్ల పారితోషికం అందుకున్నారు. అలాగే రజనీకాంత్‌ రూ.150-270 కోట్లు.. ఆమిర్‌ ఖాన్‌ రూ.100-275 కోట్లు.. ప్రభాస్‌ రూ.100-200 కోట్లు.. అజిత్‌ రూ. 105-165 కోట్లు.. సల్మాన్‌ రూ.100-150 కోట్లు.. కమల్‌ హాసన్‌ రూ. 100-150 కోట్లు.. అక్షయ్‌ కుమార్‌ రూ.60-145 కోట్ల పారితోషికంతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

x


ఇప్పటి వరకూ బాలీవుడ్‌ హీరోలే పారితోషికం విషయంలో టాప్‌ అనుకుంటున్న సమయంలో అల్లు అర్జున్‌ ఈ విషయంలో ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మంగళవారం ఫోర్బ్స్‌ ఇండియా

Updated Date - Nov 27 , 2024 | 06:26 AM