Rajadhani Rowdy: ఈ వారం రిలీజైన సినిమాల్లో.. 'రాజధాని రౌడీ' దూసుకుపోతుంది

ABN , Publish Date - Jun 15 , 2024 | 11:02 PM

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన చిత్రం "రాజధాని రౌడీ" ఇటీవలే తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శింపబడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు.

Rajadhani Rowdy: ఈ వారం రిలీజైన సినిమాల్లో.. 'రాజధాని రౌడీ' దూసుకుపోతుంది
RajadhaniRowdy

"కేజీఎఫ్" సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నారు కన్నడ స్టార్ హీరో యష్. ఆయన నటించిన ఓ చిత్రం తాజాగా "రాజధాని రౌడీ" (Rajadhani Rowdy) సినిమాతో ఇటీవలే తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి అన్ని కేంద్రాల నుంచి సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శింపబడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో చిత్ర సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ చిత్రాన్ని సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సంతోష్ కుమార్ నిర్మించగా షీనా హీరోయిన్ గా నటించింది. కేవీ రాజు దర్శకత్వం వహించారు. తాజాగా నిర్వ‌హించిన‌ కార్యక్రమంలో నిర్మాతలు టి. ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నైజాం డిస్ట్రిబ్యూటర్ సంజీవి, పీఆర్ఓ చందు రమేష్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత సంతోష్ కుమార్ మాట్లాడుతూ .. మా "రాజధాని రౌడీ" సినిమాకు అన్ని థియేటర్స్ నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. నైజాంలో 94 థియేటర్స్ లో రిలీజ్ చేశాం. హైదరాబాద్ తో పాటు బీ, సీ సెంటర్స్ లో కలెక్షన్స్ బాగున్నాయి. నేను ఈ సినిమా తీసుకున్నప్పుడే యష్ గారికి చెప్పాను బాగా రిలీజ్ చేస్తానని. మా "రాజధాని రౌడీ" సినిమా మేము పెట్టిన పెట్టుబడికి వచ్చే కలెక్షన్స్ తో చూస్తే హ్యాపీగా ఉన్నాం. "రాజధాని రౌడీ" సినిమాకు ప్రేక్షకుల ఆదరణ మరింత దక్కుతుందని ఆశిస్తున్నాం అన్నారు.

WhatsApp Image 2024-06-15 at 10.04.26 PM.jpeg


నిర్మాత టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. "రాజధాని రౌడీ" సినిమా సక్సెస్ కావడం సంతోషంగా ఉంది. ప్రేక్షకాదరణ దక్కితే చిన్న నిర్మాతలు బాగుంటారు. సినిమా మీద పిచ్చి లేకుంటే ఎవరూ ఇండస్ట్రీలోకి రారు. నిర్మాత సంతోష్ కుమార్ కూడా అలాగే ఒక ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఉంటారు. ధరలు అందుబాటులో ఉంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ కు వస్తారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు సినిమా అవార్డులను ఇవ్వబోతున్నాయి. త్వరలోనే ఏపీలో నంది అవార్డ్స్, తెలంగాణలో సీఎం రేవంత్ గారు చెప్పినట్లు గద్దర్ అవార్డ్స్ ఇస్తారని ఆశిస్తున్నామ‌న్నారు.

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. చిన్న నిర్మాతకు ఏదైనా కష్టం వస్తే ప్రసన్నకుమార్ గారు హెల్ప్ చేసేందుకు ముందుంటారు. ఈ సినిమా విషయంలోనూ ఆయన మాట సాయం చేశారు. నిర్మాత సంతోష్ నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఈ సినిమాను ఒక ప్యాషన్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నైజాం ఏరియాలో 94 థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ వారం రిలీజైన సినిమాల్లో "రాజధాని రౌడీ" సినిమానే బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీ రిలీజై 2 రోజులవుతోంది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయన్నారు.

Updated Date - Jun 16 , 2024 | 07:29 AM