Ugravataram: ఉపేంద్ర భార్య ‘ఉగ్రావతారం’ ఆ రోజే..

ABN , Publish Date - Oct 15 , 2024 | 09:41 PM

స్టార్ హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘ఉగ్రావతారం’. ఈ సినిమా సాంగ్, ట్రైలర్ లాంచ్ వేడుకను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. దసరాకి రావాల్సిన కంటెంట్ ఉన్న ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయబోతున్నారో.. మేకర్స్ ఈ కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించారు.

Ugravataram Trailer Launch Event

ఎస్‌జీఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియాంక ఉపేంద్ర (Priyanka Upendra) సమర్పణలో ఎస్.జి. సతీష్ నిర్మాతగా.. గురుమూర్తి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఉగ్రావతారం’ (Ugravataram). స్టార్ హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర లీడ్ రోల్‌లో నటించారు. సుమన్, నటరాజ్ పేరి, అజయ్, పవిత్రా లోకేష్, సాయి ధీనా, సుధి కాక్రోచ్, లక్ష్య శెట్టి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్, ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. అలాగే విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు, నటుడు సత్య ప్రకాష్, నిర్మాత రాజ్ కందుకూరి తదితరులు సందడి చేశారు. కరాటే రాజు, సత్య ప్రకాష్ చేతుల మీదుగా పాటను విడుదల చేయించారు. అనంతరం రాజ్ కందుకూరి ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

Also Read- Jr NTR: ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక, సక్సెస్ మీట్ లేకపోవడంతో.. తారక్ ఏం చేశారంటే

ట్రైలర్ విడుదల అనంతరం నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఉగ్రావతారం’ వంటి కంటెంట్ దసరాకి రావాల్సిన సినిమా. ఫీమేల్ ఓరియెంటెడ్‌గా తీసిన ఈ చిత్రం దసరాకి వస్తే ఇంకా బాగుండేది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాటిని చూపిస్తూ తీసిన ఈ చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. గురుమూర్తి ఇది వరకు తీసిన చిత్రాలు కూడా బాగుంటాయి. నవంబర్ 1న రాబోతోన్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. ప్రియాంక ఉపేంద్రకు మంచి సక్సెస్ రావాలి. ఇలాంటి చిత్రాలను మీడియా ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాని అన్నారు.

Also Read- Raveena Tandon: ముందే ప్లాన్ చేశారు.. తనపై అటాక్ చేసిన గుంపుపై షాకింగ్ కామెంట్స్


Upendra-Wife-Film.jpg

ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ.. నాకు హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఉపేంద్ర గారిని ఫస్ట్ టైం ఇక్కడే కలిశాను. హైదరాబాద్ నాకు చాలా లక్కీ సిటీ. నా కెరీర్‌లో ఇదే ఫస్ట్ యాక్షన్ ఫిల్మ్. గురుమూర్తి గారి వల్లే ఈ మూవీని చేశాను. నేను ఈ పాత్రకు సెట్ అవుతాను అని ఆయనే నమ్మారు. కెమెరామెన్ నందకుమార్ అందరినీ బాగా చూపించారు. నటరాజ్ అద్భుతంగా నటించాడు. రాజు గారు తెలుగులో మంచి పాటలు, మాటలు ఇచ్చారు. కృష్ణ బస్రూర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నవంబర్ 1న మా చిత్రం రాబోతోంది. నా మొదటి పాన్ ఇండియన్ మూవీని అందరూ చూసి బ్లాక్‌బస్టర్ చేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు. దర్శకుడు గురుమూర్తి మాట్లాడుతూ.. సమాజంలో జరిగే అన్యాయాల్ని, అఘాయిత్యాల్ని మీడియా ప్రశ్నించి ఎదురించగలదు. మా ఈ చిత్రాన్ని అటువంటి సమస్యల మీదే తీశాను. మంచి సందేశాత్మాక చిత్రమిది. ప్రియాంక మేడమ్ కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. నటరాజ్ అద్భుతంగా నటించాడు. నవంబర్ 1న రానున్న మా చిత్రాన్ని అందరూ చూడండని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సత్యప్రకాష్, నటరాజ్, కరాటే రాజు, కిన్నాల్ రాజు తదితరులు ప్రసంగించారు.

Also Read- RGV: సల్మాన్‌లో చావు భయం..

Also Read- Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్.. ఎగిరే గుర్రంపై చిరు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 15 , 2024 | 09:42 PM