NTR - Prashanth Neel: ప్రశాంత్  నీల్‌ డిజైన్ వేరులే!

ABN , Publish Date - Jun 20 , 2024 | 12:25 PM

'దేవర' (Devara) చిత్రం తర్వాత జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కలయికలో ఓ చిత్రం రాబోతుంది. ఈ సినిమాకి ‘డ్రాగన్‌’ అనే పేరు పరిశీలనలో ఉందని టాక్‌ నడుస్తోంది.

NTR - Prashanth Neel: ప్రశాంత్  నీల్‌ డిజైన్ వేరులే!

'దేవర' (Devara) చిత్రం తర్వాత జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కలయికలో ఓ చిత్రం రాబోతుంది. ఈ సినిమాకి ‘డ్రాగన్‌’ అనే పేరు పరిశీలనలో ఉందని టాక్‌ నడుస్తోంది. ఇప్పుడు ఇందులో ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ పై కొన్ని ఆసక్తికరమైన విషయాలు వైరల్‌ అవుతున్నాయి. ఈ చిత్రంలో తారక్‌ నెగటివ్‌రోల్‌లో కనిపిస్తాడని సమాచారం. డ్రాగన్‌ (Dragon) టైటిల్‌కి తగ్గట్టే ప్రశాంత్  నీల్‌ పాత్రను డిజైన్  చేశాడని టాక్‌. యూరోపియన్‌ కల్చర్‌లో చెడుకి సింబల్‌ డ్రాగన్‌. మైథాలజీలో ఓ రాక్షసుడు. డ్రాగన్‌కి అగ్గి పీల్చే గుణం వుంటుంది. అలాగే అలజడికి సింబాలిక్‌గా డ్రాగన్‌ ని వాడుతారు. ఇవన్నీ ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ లో ఉండేట్లు డిజైన్‌ చేస్తున్నారు నీల్‌.

'టెంపర్‌' చిత్రంలో ఎన్టీఆర్‌ నెగటివ్‌ టచ్‌ ఉన్న పాత్ర చేశారు. ఇప్పుడు మరోసారి ఆ తరహా పాత్రలో మెరవనున్నారు. అయితే నీల్‌ హీరో ఎప్పుడూ విలన్  టచ్‌లోనే ఉంటాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌ తో కూడా ఓ విలనీ హీరోయిజం క్యారెక్టర్‌నే ప్లాన్  చేశాడు. ఈ సినిమా ఈ ఏడాదిలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘దేవర’, ‘వార్‌2’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘దేవర’ తొలిభాగం చిత్రీకరణ పూర్తవ్వగానే ప్రశాంత్‌ నీల్‌ సినిమాపై దృష్టి పెడతారు.

Updated Date - Jun 20 , 2024 | 12:25 PM