Jai Hanuman: ‘జై హనుమాన్’ వర్క్ స్టార్ట్ అయ్యింది.. త్వరలోనే ఫస్ట్ లుక్!
ABN , Publish Date - Mar 02 , 2024 | 05:29 PM
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రయూనిట్‌కు హనుమాన్ ప్రతిమతో కూడిన జ్ఞాపికలను మేకర్స్ అందజేశారు.
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులని అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఎపిక్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించి, సక్సెస్ ఫుల్‌గా 50 రోజులని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్‌ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ వేడుకలో చిత్రయూనిట్‌కు హనుమాన్ ప్రతిమలను జ్ఞాపికలుగా మేకర్స్ అందించారు. (Hanuman 50 Days Celebrations)
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ (Prasanth Varma Speech).. ‘‘50 రోజుల పండగ చూసి చాలా కాలమైంది. అది ‘హనుమాన్’ సినిమాకి జరగడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. ఒక సక్సెస్ ఫుల్ సినిమా చాలా మంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, పంపిణీదారులు, థియేటర్స్ ఇలా చాలా మంది జీవితాలని మారుస్తుంది. అది సెలెబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ‘హనుమాన్’ లాంటి సినిమా 50 రోజులు 150 థియేటర్స్‌లో నడిచిందనేది చాలా మందికి నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ వేడుక చాలా ముఖ్యం. నా మొదటి సినిమా ‘అ’ను నాని గారు నిర్మించారు. ఆ సినిమా క్రిటికల్‌గా చాలా పేరు వచ్చింది. కమర్షియల్‌గా మంచి హిట్ అయ్యింది. అయితే సక్సెస్ ని సక్సెస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుకదా అని సక్సెస్ ఈవెంట్ చేయలేదు. సక్సెస్ ఈవెంట్ చేయలేదు కాబట్టి ఆ సినిమా కమర్షియల్ హిట్ కాలేదేమో అని చాలా మంది అనుకున్నారు. అందుకే సక్సెస్‌ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, ఒక జెన్యూన్ హిట్ అనేది చాలా ముఖ్యం. ఇలాంటి వేడుకలో అంతా పాల్గొవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. సినిమాని ఆదరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రీమాస్టర్డ్ వెర్షన్ వస్తోంది. అది మీకు ఇంకా సర్ప్రైజ్ చేయబోతుంది.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే సినిమాలకు ‘హనుమాన్’ విజయం గట్టిపునాది వేసింది. ప్రేక్షకులని అలరించే క్వాలిటీ సినిమాలు మా యూనివర్స్ నుంచి రెడీ చేస్తున్నాం. హనుమాన్ ఇంటర్నేషనల్ రిలీజ్ కూడా త్వరలో జరగబోతుంది. హనుమాన్ ప్రపంచదేశాల్లో కూడా మన తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటబోతుంది. దీనికి కారణం మా నిర్మాత విజన్. నిరంజన్ గారికి థాంక్స్. హనుమాన్ 50 రోజులు అనేది ఒక స్టెప్ మాత్రమే. ఈ సినిమాతో ఇంకెన్నో స్టెప్స్ ఎక్కబోతున్నాం. ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సినిమాని సబ్మిట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అవార్డ్స్ వస్తాయనే నమ్మకం వుంది. ‘జై హనుమాన్’ (Jai Hanuman) వర్క్ స్టార్ట్ అయ్యింది. అతి త్వరలో దాని ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. హనుమాన్‌లో చివరి 5 నిమిషాలు ఎలా విపరీతంగా నచ్చిందో.. ‘జై హనుమాన్’లో అది సినిమా అంతా ఉండబోతుంది. మీరు ఇచ్చిన ఈ సక్సెస్‌ని బాధ్యతగా తీసుకొని మీ రుణాన్ని ‘జై హనుమాన్’తో తీర్చుకోబోతున్నాం. జై శ్రీరామ్.. జై హనుమాన్.. జైహింద్’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Save The Tigers 2: ‘సేవ్ ద టైగర్స్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..
***************************
*Charan and Upasana: భార్య కాళ్లకు మసాజ్ చేస్తున్న రామ్ చరణ్.. వీడియో వైరల్
************************
*Tarak and Charan: రామ్-భీమ్ కలిసి ఒకే కారులో.. వీడియో వైరల్
********************
*Jr NTR: ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, రిషభ్ శెట్టి, ప్రశాంత్ నీల్.. ఏంటి కథ?
**************************