ప్రభాస్‌ కాలికి గాయం

ABN , Publish Date - Dec 17 , 2024 | 06:05 AM

ప్రభా్‌సకు ఓ సినిమా షూటింగ్‌లో కాలికి స్వల్ప గాయమైంది. దీంతో షూటింగులకి విరామమిచ్చిన ప్రభాస్‌.. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన నటించిన ‘కల్కి 2898 ఏ.డీ’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 3న...

ప్రభా్‌సకు ఓ సినిమా షూటింగ్‌లో కాలికి స్వల్ప గాయమైంది. దీంతో షూటింగులకి విరామమిచ్చిన ప్రభాస్‌.. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన నటించిన ‘కల్కి 2898 ఏ.డీ’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 3న జపాన్‌లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్‌ జపాన్‌ వెళ్లాల్సిఉంది. కాలికి గాయమవ్వడంతో జపాన్‌కు రాలేనంటూ.. అక్కడి అభిమానుల కోసం ప్రభాస్‌ ఓ పోస్టు పెట్టారు. ‘‘నాపై మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు. మీ అందర్నీ చూడాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను. షూటింగ్‌లో గాయమవ్వడంతో జపాన్‌కు రాలేకపోతున్నాను. నన్ను క్షమించండి. మీ అందర్నీ త్వరలోనే కలుసుకోవాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. కాగా, ప్రభాస్‌ గాయం వల్ల ‘రాజాసాబ్‌’ సినిమా విడుదల ఆలస్యం అవుతుందని సోషల్‌మీడియాలో అభిమానులు ఆందోళన పడుతున్నారు.


దీనిపై ప్రభాస్‌ టీమ్‌ స్పందించింది. ‘‘ప్రభాస్‌ గాయం స్వల్పమైందే. ‘రాజాసాబ్‌’ టాకీ పార్ట్‌ పూర్తైంది. సినిమా అనుకున్న సమయానికే వస్తుంది. ‘ఫౌజీ’ షూటింగ్‌కు మాత్రమే ఆయన విరామమిచ్చారు. త్వరలోనే ఆయన షూటింగ్‌లో పాల్గొంటారు’’ అని పేర్కొంది.

Updated Date - Dec 17 , 2024 | 06:05 AM