Pooja Hegde: మళ్ళీ బిజీ అయిపోయిన పూజ హెగ్డే, పారితోషికం కూడా తగ్గేదే లే !

ABN , Publish Date - Jun 20 , 2024 | 04:39 PM

మధ్యలో కొంత విరామం తీసుకున్న పూజ హెగ్డే మళ్ళీ బిజీ గా అయిపొయింది. ఇటు దక్షిణాదిలోనూ, అటు హిందీలోనో వరసగా సినిమాలు చేసుకుంటూ, తన డిమాండ్ ఏమీ తగ్గలేదంటూ, పారితోషికంలో కూడా ఏమాత్రం తగ్గకుండా మళ్ళీ పూర్వ వైభవంలోకి వచ్చింది పూజ హెగ్డే.

Pooja Hegde: మళ్ళీ బిజీ అయిపోయిన పూజ హెగ్డే, పారితోషికం కూడా తగ్గేదే లే !
Pooja Hegde

తెలుగులో చాలా తక్కువ సమయంలో అగ్ర నటీమణుల్లో ఒకరిగా చలామణి ఆయిన నటీమణుల్లో పూజ హెగ్డే ఒకరు. అటు సినిమాలతో పాటు, ఇటు పారితోషికంలో కూడా అగ్రగామిగా వున్న పూజ హెగ్డే ఈమధ్య కొంత విరామం తీసుకుంది. 'అల వైకుంఠపురంలో' సినిమా తరువాత పూజ హెగ్డే కి తెలుగులో మంచి విజయం దక్కలేదు, ఆ సినిమా తరువాత ఒకటి రెండు సినిమాలు చేసిన అవి బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా నడవలేదు. (Pooja Hegde is back to busy days both in South and Hindi films)

poojahegdebusy.jpg

ఆ తరువాత పూజ హెగ్డే పని అయిపొయింది, ఇక తెలుగులో సినిమాలు రావటం కష్టం అన్నారు. కానీ అందరినీ ఆశ్చ్యర్య పరుస్తూ పూజ హెగ్డే ఇటు దక్షిణాదిలోనూ, అటు హిందీలోనూ మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ, పారితోషికం కూడా ఎక్కడా తగ్గించకుండా తన హవాని కొనసాగిస్తోంది. ఇప్పుడు వరస సినిమాలతో పూజ మళ్ళీ బిజీ అయిపొయింది. (Pooja Hegde is signed nearly three films in South and one Hindi film with Shahid Kapoor)

poojahegdenewpic.jpg

ప్రస్తుతం అండమాన్ లో తమిళ సూపర్ స్టార్ సూర్య తో సినిమా చిత్రీకరణలో వుంది పూజ హెగ్డే. ఈ సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. ఈ సినిమా తరువాత నిర్మాత సురేష్ బాబు, పూజ హెగ్డే తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది వుమెన్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. ఇది అయ్యాక ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి ఒక కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారు, ఆ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా కూడా వుమెన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కనుంది అని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తారని తెలుస్తోంది.

poojahegde-new1.jpg

దక్షిణాదిలో ఆమె ఇలా వరస సినిమాలతో బిజీగా ఉంటే, అటు హిందీలో కూడా ఆమె ఒక సినిమా చేస్తోంది. షాహిద్ కపూర్ కథానాయకుడిగా, పూజ హెగ్డే కథానాయికగా ఒక సినిమా చిత్రీకరణ కూడా మొదలైన సంగతి తెలిసిన విషయమే. రోషన్ ఆండ్రుస్ ఈ సినిమాకి దర్శకుడు, రాయ్ కపూర్ ఫిల్మ్స్ తో జీ స్టూడియో ఈ సినిమా నిర్మాణ సారధ్యం చేస్తోంది.

poojahegde.jpg

ఇలా వరస సినిమాలతో బిజీగా ఉంటున్న పూజ హెగ్డే పారితోషికం ఎంతో తెలిస్తే షాకవుతారు మీరు. ఆమె అక్షరాలా రూ. 4 కోట్ల రూపాయలు తీసుకుంటోంది. మధ్యలో విరామం తీసుకున్నా కూడా పారితోషికంతో మాత్రం తగ్గేదే లే అని చెప్తోంది పూజ హెగ్డే. ఆమె ఏ సినిమా చేసిన అందులో తన హార్డ్ వర్క్ పెడుతుంది, అందుకని ఆమెకి పారితోషికం అంత ఇవ్వవచ్చు అని అంటున్నారు పరిశ్రమలో.

Updated Date - Jun 20 , 2024 | 04:39 PM