పోలీస్‌ ప్రేమగీతం

ABN , Publish Date - Dec 20 , 2024 | 02:11 AM

వెంకటేశ్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్‌ కథానాయికలు. వెంకటేశ్‌ శక్తిమంతమైన పోలీస్‌ అధికారి పాత్రలో...

వెంకటేశ్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్‌ కథానాయికలు. వెంకటేశ్‌ శక్తిమంతమైన పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నారు. చిత్రం నుంచి రెండో గీతాన్ని యూనిట్‌ గురువారం విడుదల చేసింది. ‘నా లైఫ్‌లో ఉన్న ఆ ప్రేమ పేజీ’ అంటూ సాగే ఈ గీతానికి భీమ్స్‌ సిసిరోలియో స్వరాలందించడంతో పాటు, ప్రణవీ ఆచార్యతో కలసి ఆలపించారు. అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించారు. దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది.

Updated Date - Dec 20 , 2024 | 02:11 AM