Pokiri: ‘నా గుండె జారిపోయిందే’ అంటోన్న ‘పోకిరి’

ABN , Publish Date - Dec 31 , 2024 | 09:14 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘పోకిరి’. ఇప్పుడిదే టైటిల్‌తో మరో సినిమా రాబోతోంది. ఈ చిత్ర ఫస్ట్ సాంగ్‌ని హీరో పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. అనంతరం ఈ ‘పోకిరి’ విశేషాలను మేకర్స్ తెలియజేశారు.

Pokiri Movie Song Launch Event

‘పోకిరి’ అనగానే గుర్తొచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు, పూరీ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం. ఇప్పుడదే టైటిల్‌తో మరో ఫిల్మ్ రాబోతోంది. వరుణ్ రాజ్ స్వీయ నిర్మాణం‌లో, ఆయనే హీరో‌గా నటిస్తున్న చిత్రం పోకిరి. ఈ సినిమాలో మమత హీరోయిన్‌గా నటిస్తుండగా.. వికాస్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో వరుణ్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఈ సినిమాలో నుంచి మొదటి పాటని మేకర్స్ విడుదల చేశారు.

Also Read-Dil Raju: సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ కామెంట్స్‌కు దిల్ రాజు స్పందనిదే..

ఈ కార్యక్రమంలో హీరోయిన్ మమత మాట్లాడుతూ.. ఇది నా ఫస్ట్ ఎక్స్‌పీరియెన్స్. డైరెక్టర్ వికాస్, హీరో వరుణ్‌కు థ్యాంక్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే యూనిటీ గుర్తొస్తుంది. ఇదొక మంచి సినిమా. అందరూ ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నానని తెలపగా.. డైరెక్టర్ వికాస్ మాట్లాడుతూ.. మేము స్టోరీ లైన్ రాసుకున్నప్పటి నుంచి ‘పోకిరి’ అనే టైటిల్ అనుకున్నాం. ఈ సినిమా వేరే టైటిల్ పెడదామని చాలా అనుకున్నాం. కానీ స్టోరీకి ‘పోకిరి’ అనేదే సెట్ అవుతుందని ఈ టైటిల్ సెట్ చేసుకున్నాం. కథ రాసుకున్నప్పటి నుంచి ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకున్నాం. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నామని అన్నారు.


Pokiri.jpg

హీరో మరియు నిర్మాత వరుణ్ రాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో గట్టిగా హిట్ కొడతాం. ఈ సినిమా హిట్ అవుతుందని మాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను పవన్ కళ్యాణ్‌గారి అభిమానిని. అలాగే చిరంజీవిగారు, మహేష్ బాబుగారంటే కూడా నాకు అంతే ఇష్టం. ఈ సినిమా టైటిల్‌లోనే దమ్ముంది. ‘పోకిరి’కి ఓనర్ మహేష్ బాబు గారే. మేమంతా అభిమానులం అంతే. అభిమానులందరూ ఈ సినిమాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని అన్నారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.


Aslo Read-Game Changer: డిప్యూటీ సీఎం డేట్ ఇస్తే.. హిస్టరీ రిపీట్ అవుద్ది..

Also Read-Yearender 2024 ఆర్టికల్స్..

Also Read-Devi Sri Prasad: 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' వెనుక ఏం జరిగిందంటే..

Also Read-Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 31 , 2024 | 09:14 PM