ఈ తరాన్ని మెప్పిస్తుంది
ABN , Publish Date - Nov 06 , 2024 | 03:14 AM
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్, సోనూఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, కుష్బూ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్‌రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్‌కుమార్ బొజ్జం నిర్మించారు...
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్, సోనూఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, కుష్బూ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్‌రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్‌కుమార్ బొజ్జం నిర్మించారు. ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘నేటి తరానికి నచ్చే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాం. మా సినిమా నచ్చి అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ మంచి రేట్లు ఇచ్చి తీసుకున్నారు’ అని చెప్పారు.