దాండియా ఆడుతూ..
ABN , Publish Date - Sep 13 , 2024 | 04:35 AM
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న భారీ పీరియాడికల్ థ్రిల్లర్ ‘క’ చిత్రంలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో తన్వీ రామ్ పోషిస్తున్న రాధ పాత్ర ఫస్ట్ లుక్...
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న భారీ పీరియాడికల్ థ్రిల్లర్ ‘క’ చిత్రంలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో తన్వీ రామ్ పోషిస్తున్న రాధ పాత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దాండియా ఆడుతూ అందంగా కనిపిస్తూ తన్వీ రామ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘క’లో ఆమెది కీలకమైన పాత్ర. జంట దర్శకులు సుజీత్, సందీప్ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చింతా గోపాలకృష్ణారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.