ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి
ABN , Publish Date - Dec 24 , 2024 | 05:07 AM
వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశ్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో శాంతమ్మ మలికిరెడ్డి నిర్మించారు. ఈ నెల 27న సినిమా విడుదలవుతోంది...
వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశ్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో శాంతమ్మ మలికిరెడ్డి నిర్మించారు. ఈ నెల 27న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో హీరో వీర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలుగులో లీగల్ థ్రిల్లర్‌లు తక్కువగా వస్తుంటాయి. రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో ఈ సినిమాలో అద్భుతంగా చూపించాం’’ అని చెప్పారు.
దర్శకుడు రవి మాట్లాడుతూ ‘‘ఇలాంటి సబ్జెక్ట్‌తో తెరకెక్కిన చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. టీజర్‌కు మంచి బజ్ వచ్చింది. మేము ఈ సినిమాను 70 థియేటర్లలో విడుదల చేస్తున్నామని డిస్ట్రిబ్యూటర్ విశ్వనాథ్ చౌదరి తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థ ఎంతో కీలకమని, లా సబ్జెక్టుపై అరుదైన సినిమా తీసుకు వస్తున్నామని అన్నారు నిర్మాత శాంతమ్మ మలికిరెడ్డి.