Peka Medalu: ఆడవారికి మగవారు ఇచ్చే..

ABN , Publish Date - Jul 09 , 2024 | 05:29 PM

వినోద్‌ కిషన్‌ (Vinodh Kishan) హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'పేక మేడలు’. అనూష కృష్ణ (Anusha Krishna) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రాకేష్‌ వర్రే (Rakesh varre) నిర్మిస్తున్నారు.


వినోద్‌ కిషన్‌ (Vinodh Kishan) హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'పేక మేడలు’. అనూష కృష్ణ (Anusha Krishna) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రాకేష్‌ వర్రే (Rakesh varre) నిర్మిస్తున్నారు. నీలగిరి మామిళ్ల దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మాట్లాడుతూ "ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలకి దగ్గరగా ఈ చిత్రం ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు చక్కని వినోదాన్ని పంచుతాం’’ అని అన్నారు.

Peka.jpg

నిర్మాత రాకేష్‌ వర్రే మాట్లాడుతూ "వినూత్న రీతిలో క్యూఆర్‌ స్కాన్‌తో ప్రమోషన్‌ మొదలుపెట్టాం. ఇది  కామెడీ సినిమా మాత్రమే కాదు ఇందులో ఆడవారు మగవారికి ఇస్తున్న సపోర్ట్‌ గురించి ఒక కోర్‌ పాయింట్‌తో మంచి కాన్సెప్ట్‌ సినిమాని తీశాం. ఎంటర్టైన్మెంట్‌తోపాటు ఎమోషనల్‌గా కూడా ఉంటుంది. కచ్చితంగా అందరికీ నచ్చే చిత్రమిది’’ అని అన్నారు.


 

Updated Date - Jul 09 , 2024 | 05:29 PM