Rakshana in OTT: సెన్సేషనల్ బ్యూటీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది..

ABN , Publish Date - Aug 01 , 2024 | 12:41 AM

‘ఆర్ఎక్స్100’ చిత్రంతో సెన్సేషనల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో, ప్రణదీప్‌ ఠాకూర్‌ దర్శక, నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘రక్షణ’. ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ జూన్‌ 7న థియేటర్లలో విడుదలై మంచి స్పందననే రాబట్టుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు థ్రిల్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్ట్ 1 నుంచి ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీలో భవానీ మీడియా డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది.

Payal Rajput in Rakshana

‘ఆర్ఎక్స్100’ (RX100) చిత్రంతో సెన్సేషనల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) ప్రధాన పాత్రలో, ప్రణదీప్‌ ఠాకూర్‌ (Prandeep Thakore) దర్శక, నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘రక్షణ’. ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ జూన్‌ 7న థియేటర్లలో విడుదలై మంచి స్పందననే రాబట్టుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు థ్రిల్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్ట్ 1 నుంచి ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీ (Aha OTT)లో భవానీ మీడియా (Bhavani Media) డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో ‘లేడీ సింగం’లా పాయల్‌ రాజ్‌పుత్‌ తన నటనతో అదరగొట్టింది. కథ, కథనం, పెర్ఫార్మెన్స్ లు ఆడియన్స్‌కి సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ అందించేలా వుంటాయని మేకర్స్ చెబుతున్నారు. కచ్చితంగా ఈ సినిమా ఆహా ప్రేక్షకులను అలరిస్తుందని, ఓటీటీలోనూ సక్సెస్‌ఫుల్ చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Also Read- Raj Tarun: ఆరోపణలు మాత్రమే, ఆధారాలు చూపించలేదు.. లావణ్య వివాదంపై రాజ్ తరుణ్

ఈ సినిమా కథ విషయానికి వస్తే (Rakshana Movie Story).. ఏసీపీ కిర‌ణ్(పాయ‌ల్ రాజ్‌పుత్) సిన్సియ‌ర్ లేడీ పోలీస్ ఆఫీస‌ర్. న‌గ‌రంలో జ‌రుగుతున్న వ‌రుస హ‌త్య‌ల వెనుక ఉన్న‌ది ఎవ‌ర‌నే విష‌యాన్ని తెలుసుకునేందుకు ఆమె రంగంలోకి దిగుతుంది. అయితే ఆ హత్యలన్నింటికీ ఓ సైకో కిల్ల‌ర్ కార‌ణ‌మని ఆమె ఇన్విస్టిగేషన్‌లో తెలుసుకుంటుంది. కానీ అదే సమయంలో ఓ కేసు కార‌ణంగా ఆమె స‌స్పెండ్ అవుతుంది. మరి సస్పెండ్ అయిన కిర‌ణ్ ఆ సైకో కిల్లర్‌ని ఎలా పట్టుకుంది? అస‌లు ఈ హ‌త్య‌ల వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..? అనేది తెలియాలంటే అనుక్షణం థ్రిల్లింగ్ సాగే ఈ సినిమా చూడాల్సిందే.


Rakshana.jpg

మానస్ నాగులపల్లి, రాజీవ్ కనకాల, చక్రపాణి ఆనంద వంటివారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రానికి యంగ్ కంపోజర్ మహతి స్వర సాగర్ (Mahathi Swara Sagar) సంగీతం అందించారు. ఈ వీకెండ్ ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకి ‘ఆహా’లో ఈ సినిమా ఫస్ట్ ఛాయిస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే థియేటర్లలో ఈ మూవీ విడుదలకు ముందు జరిగిన హీరోయిన్ కాంట్రవర్సీ కూడా ఈ సినిమా గురించి అంతా మాట్లాడుకునేలా చేసిందనే విషయం తెలిసిందే.

Read Latest Cinema News

Updated Date - Aug 01 , 2024 | 12:41 AM