పవన్ ఫుట్‌బాల్ లాంటివారు
ABN , Publish Date - Oct 08 , 2024 | 02:08 AM
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఫుట్‌బాల్ లాంటివారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు...
తమిళ చానల్ ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఫుట్‌బాల్ లాంటివారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ తమిళ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ ‘ఫుట్‌బాల్ ఆటను చూసేందుకు మైదానానికి వెళ్లే వ్యక్తి ప్రేక్షకుడిగా ఉండాలి. లేదా ఏదో ఒక టీమ్‌లో సభ్యుడిగానో, మ్యాచ్ అంపైర్‌గానో ఉండాలి. కానీ, పవన్ కల్యాణ్ ఫుట్‌బాల్ వంటివారు. మైదానంలో ఫుట్‌బాల్‌ని తన్నినట్టుగా ఎవరైనా తంతారు. సిగ్గూశరం లేని వ్యక్తి. ఒక అవకాశవాది. దేశంలో హిందూ ఽధర్మానికి, సనాతన ధర్మానికి ఎక్కడా ప్రమాదం పొంచిలేదు. బీజేపీ మాత్రమే ప్రమాదం ఉందంటూ చెబుతోంది.. ఈ విషయాన్ని ఆయన తెలుసుకుంటే మంచిది.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి ఎక్కడా చెప్పలేదు. సనాతన ధర్మంలోని హెచ్చుతగ్గులు, తారతమ్యాల గురించి మాత్రమే చెప్పారు’ అని ప్రకాశ్ రాజ్ అన్నారు. -
చెన్నై (ఆంధ్రజ్యోతి)