పి.సుశీలకు ‘కలైంజర్‌ స్మారక కళారంగ’ పురస్కారం

ABN , Publish Date - Sep 25 , 2024 | 01:24 AM

తమిళనాడు ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి వేడుకల సందర్భంగా చిత్రసీమ ప్రముఖులకిచ్చే ‘కలైంజర్‌ స్మారక కళారంగ విద్వాంసుల అవార్డు’కు గానకోకిల పి.సుశీల ఎంపికయ్యారు. గత మూడేళ్లుగా...

తమిళనాడు ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి వేడుకల సందర్భంగా చిత్రసీమ ప్రముఖులకిచ్చే ‘కలైంజర్‌ స్మారక కళారంగ విద్వాంసుల అవార్డు’కు గానకోకిల పి.సుశీల ఎంపికయ్యారు. గత మూడేళ్లుగా డీఎంకే ప్రభుత్వం ఈ అవార్డులను సినీ, కళారంగాలకు,దశాబ్దాల తరబడి సేవలందిస్తున్న దిగ్గజాలకు ప్రదానం చేసి సత్కరిస్తోంది. ఆ మేరకు 2023వ సంవత్సరానికి గాను ఈ అవార్డుకు తమిళ సినీ గేయరచయిత సాహిత్య అకాడమీ గ్రహీత ఎం.మేత్తా, సినీ నేపథ్య గాయని పి.సుశీల ఎంపిక అయ్యారు. ప్రముఖ తమిళ సినీ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్‌ నేతృత్వంలో నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్‌, మరో దర్శకుడు కరుపళనియప్పన్‌ సభ్యులుగా ఉన్న ఎంపిక కమిటీ ఈ మేరకు మంగళవారం ప్రకటించింది.


ఈ అవార్డు గ్రహీతలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ రూ.10లక్షల నగదు బహుమతి, ప్రశంసపత్రాన్ని అందజేయనున్నారు. ఈ నెల 30న చెన్నై సచివాలయంలో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో సినీ గేయరచయిత ఎం.మేత్తా, గాయని పి. సుశీల ఈ అవార్డులను అందుకోనున్నారు.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Sep 25 , 2024 | 01:24 AM