కొత్త ఏడాదిలో సెట్స్‌పైకి

ABN , Publish Date - Oct 10 , 2024 | 05:54 AM

మహేశ్‌బాబు- రాజమౌళి కలయికలో వస్తున్న చిత్రం (ఎస్‌ఎ్‌సఎంబీ 29-వర్కింగ్‌ టైటిల్‌). బారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొన్న నేపథ్యంలో దీనిపై అప్డేట్‌ వచ్చింది...

మహేశ్‌బాబు- రాజమౌళి కలయికలో వస్తున్న చిత్రం (ఎస్‌ఎ్‌సఎంబీ 29-వర్కింగ్‌ టైటిల్‌). బారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొన్న నేపథ్యంలో దీనిపై అప్డేట్‌ వచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం షూటింగ్‌ మొదలవనుంది. ఈ విషయాన్ని రచయిత విజయేంద్రప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాకు కథ రాయడానికి దాదాపు రెండేళ్లు పట్టిందని ఆయన తెలిపారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించనున్నారని విజయేంద్ర ప్రసాద్‌ చెప్పారు. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు ఇప్పటికే కొత్త లుక్‌తో సిద్ధమయ్యారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో అడ్వంచరస్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కనుంది. కేఎల్‌ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది.

Updated Date - Oct 10 , 2024 | 05:54 AM