తెలుగు భాషా దినోత్సవం రోజున...

ABN , Publish Date - Aug 30 , 2024 | 05:53 AM

ఎప్పటినుంచో తెలుగు భాష, సంస్కృతి, విలువల గురించి సినిమా తీయాలనే కోరిక ఉంది. సందేశంలా కాకుండా మంచి వాణిజ్య విలువలు ఉన్న అంశాలు కలిగిన కథ దొరికినప్పుడే అలాంటి సినిమా చేయాలి. ఇప్పుడు అటువంటి కథ కుదిరింది. 1980 నేపథ్యంలో జరిగే సినిమా ఇది.

ఎప్పటినుంచో తెలుగు భాష, సంస్కృతి, విలువల గురించి సినిమా తీయాలనే కోరిక ఉంది. సందేశంలా కాకుండా మంచి వాణిజ్య విలువలు ఉన్న అంశాలు కలిగిన కథ దొరికినప్పుడే అలాంటి సినిమా చేయాలి. ఇప్పుడు అటువంటి కథ కుదిరింది. 1980 నేపథ్యంలో జరిగే సినిమా ఇది. తెలుగు భాషా దినోత్సవం రోజున ఈ సినిమా వివరాలు ప్రకటించడం ఆనందంగా ఉంది’ అన్నారు దర్శకుడు వైవీఎస్‌ చౌదరి. సీనియర్‌ ఎన్టీఆర్‌ ముని మనవడు నందమూరి తారక రామారావు హీరోగా, వీణా రావు హీరోయిన్‌గా నటించనున్నారు. గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నందమూరి హరికృష్ణ వర్థంతి సందర్భంగా చౌదరి ఆయనకు నివాళులు అర్పించారు. చిత్ర ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత రమేశ్‌ అత్తిలిని చౌదరి ఈ సందర్భంగా పరిచయం చేశారు. ‘మేం నలుగురం స్నేహితులం కలసి చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాలని అనుకున్నాం. చౌదరిగారితో కలసి ఈ ప్రాజెక్ట్‌ చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు రమేశ్‌ అత్తిలి. ఈ కార్యక్రమంలో నిర్మాత యలమంచిలి గీత, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌, గీత రచయిత చంద్రబోస్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 05:53 AM