Malavika Manoj: బర్త్‌డే ‘భామ’.. కుర్రాళ్లు రెడీగా ఉండండమ్మా..

ABN , Publish Date - Jul 06 , 2024 | 06:13 PM

‘జో’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ల హృదయాలు దోచుకున్న నటి మాళవిక మనోజ్. ఇప్పుడు సుహాస్ సరసన ప్రేమ‌క‌థా చిత్రం అయిన ‘ఓ భామ అయ్యో రామ’లో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలైంది. విఆర్ట్స్అండ్ చిత్ర‌ల‌హ‌రి టాకీస్ ప‌తాకంపై హ‌రీష్ న‌ల్లా, ప్ర‌దీప్ తళ్లపు రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. రామ్ గోదాల డైరెక్ట్ చేస్తున్నారు. శనివారం మాళవిక మనోజ్ బర్త్‌డే స్పెషల్‌గా ఆమె ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు.

Malavika Manoj

‘జో’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ల హృదయాలు దోచుకున్న నటి మాళవిక మనోజ్ (Heroine Malavika Manoj). ఇప్పుడు సుహాస్ సరసన ప్రేమ‌క‌థా చిత్రం అయిన ‘ఓ భామ అయ్యో రామ’ (Oh Bhama Ayyo Rama)లో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలైంది. విఆర్ట్స్అండ్ చిత్ర‌ల‌హ‌రి టాకీస్ ప‌తాకంపై హ‌రీష్ న‌ల్లా, ప్ర‌దీప్ తళ్లపు రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. రామ్ గోదాల (Ram Godala) డైరెక్ట్ చేస్తున్నారు. శనివారం (జూలై 6) హీరోయిన్ మాళవిక మనోజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ఓ భామ అయ్యో రామ’ నుంచి ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.

Also Read- Kalki 2898AD: దర్శకుడు నాగ్ అశ్విన్ అది ఒప్పేసుకున్నాడు


Malavika.jpg

ఈ ఫస్ట్ లుక్‌ (Oh Bhama Ayyo Rama Heroine First Look)ని పరిశీలిస్తే.. బర్త్‌డే‌కి పర్ఫెక్ట్ సింక్ అనేలా మేకర్స్ ఈ ఫస్ట్ లుక్‌ని డిజైన్ చేశారు. ఒక కొలనులో పింక్ కలర్ పడవ మీద తామర పువ్వుల మధ్యలో హీరోయిన్ మాళవిక మనోజ్ క్యూట్‌గా ఈ పిక్‌లో నిలబడి ఉంది. మరోసారి ఈ అందాల భామ యువత హృదయాలను దోచుకోవడానికి తెలుగులో ‘ఓ భామ అయ్యో రామ’తో ప్రేక్షకుల ముందుకు రానుందనేలా.. ఈ ఫస్ట్ లుక్ హింట్ ఇచ్చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. కాగా.. అనిత హ‌స్సా నంద‌ని, అలీ, త‌దిత‌రులు ఇతర పాత్రలలో న‌టిస్తున్న ఈ చిత్రానికి రథన్ సంగీతం, బ్రహ్మకడలి ఆర్ట్, భవీన్ ఎమ్. షా ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. (HBD Malavika Manoj)

Read Latest Cinema News

Updated Date - Jul 06 , 2024 | 06:13 PM