Filmfare South Indian Awards : ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఉత్తమ నటిగా సాయి పల్లవి
ABN , Publish Date - Jul 12 , 2024 | 01:41 AM
జాతీయ చలనచిత్ర అవార్డుల తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫిల్మ్‌పేర్ సౌత్ ఇండియన్ అవార్డులను గురువారం ప్రకటించారు. అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు పొందిన ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం...
ఫిల్మ్‌ఫేర్ సౌత్ ఇండియన్ అవార్డుల సందడి
జాతీయ చలనచిత్ర అవార్డుల తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫిల్మ్‌పేర్ సౌత్ ఇండియన్ అవార్డులను గురువారం ప్రకటించారు. అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు పొందిన ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం తెలుగు విభాగంలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.
ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎన్నికయ్యారు. ‘సీతారామం’లో నటించిన మృణాల్ ఠాకూర్ ఉత్తమ నటిగా, ‘విరాటపర్వం’ చిత్రంలో నటించిన సాయిపల్లవి క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉత్తమ సహాయ నటులుగా ‘భీమ్లా నాయక్’లో నటించిన రానా , ‘విరాటపర్వం’లో నటించిన నందితా దాస్ ఎంపికయ్యారు. ఉత్తమ గేయ రచయితగా సీతారామశాస్త్రి (సీతారామం) ఎన్నికయ్యారు.
తమిళంలో ఉత్తమ నటుడిగా కమల్ హాసన్ (విక్రమ్) ఉత్తమ నటిగా సాయిపల్లవి, ఉత్తమ చిత్రంగా పొన్నియిన్ సెల్వం 1’, ఆ సినిమాకు దర్శకత్వం వహించిన మణిరత్నం ఉత్తమ దర్శకుడిగా ఎన్నికయ్యారు. కన్నడంలో ‘కాంతార’, మలయాళంలో ‘న్నా థాన్ కేసు కుడు’ ఉత్తమ చిత్రాలుగా ఎన్నికయ్యాయి.