Niharika Konidela: అల్లు అర్జున్‌ని సాయి దుర్గా తేజ్ అన్ ఫాలో చేయడంపై నిహారిక స్పందనిదే..
ABN , Publish Date - Jun 15 , 2024 | 10:54 AM
ట్విట్టర్, ఇన్‌స్టాగ్రమ్ వంటి సోషల్ మాధ్యమాలలో అల్లు అర్జున్‌ని సాయి దుర్గా తేజ్ అన్‌ఫాలో చేయడంపై ఇప్పటికీ రకరకాలుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదే విషయాన్ని తాజాగా మెగా డాటర్ నిహారికను మీడియా ప్రశ్నించగా ఆమె ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు. అందుకు ఎవరి కారణాలు వారికి ఉంటాయని ఆమె మీడియాతో అన్నారు.
రెండు రోజుల క్రితం సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) తను ఫాలో అయ్యే లిస్ట్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun)ను అన్ ఫాలో చేసినట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రమ్ వంటి సోషల్ మాధ్యమాలలో అల్లు అర్జున్‌ని సాయి దుర్గా తేజ్ అన్‌ఫాలో చేయడంపై ఇప్పటికీ రకరకాలుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదే విషయాన్ని తాజాగా మెగా డాటర్ నిహారిక (Mega Daughter Niharika)ను మీడియా ప్రశ్నించగా ఆమె ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు.
Also Read- Pawan Kalyan: పవన్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu). యదు వంశీ దర్శకత్వంలో పక్కా ప్లానింగ్‌తో మేకర్స్ అనుకున్న సమయానికి కన్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి విడుదలకు రెడీ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మీడియా అల్లు అర్జున్‌ని సాయి దుర్గా తేజ్ అన్ ఫాలో చేయడంపై ప్రశ్నించారు. (Committee Kurrollu Teaser Launched)
ఈ ప్రశ్నలకు నిహారిక (Niharika) సమాధానమిస్తూ.. ‘‘ఎవరు ఎవరిని ఎందుకు అన్ ఫాలో చేస్తారో నాకు తెలియదు. మీరడిగే ప్రశ్నకు సంబంధించి నాకేం తెలియదు. అయితే అన్ ఫాలో చేయడానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయి. అవేంటనేది నాకు తెలియదు’’ అని నిహారిక చెప్పుకొచ్చారు. ఇక ఈ ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా గురించి నిహారిక మాట్లాడుతూ.. ‘‘అందరం ఓ ఫ్యామిలీలా కష్టపడి ఈ సినిమాను తీశాం. త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల చేస్తాం. యదు వంశీ వంశీ కథ చెప్పే సమయంలో పదకొండు మంది జీవితాల్ని విజువల్‌గా కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఇందులోని ఎమోషన్స్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు. (Allu Arjun vs Sai Durga Tej)
Read Latest Cinema News