Harsha Sai: హర్ష కేసులో మరో 'ట్విస్ట్'

ABN , Publish Date - Oct 05 , 2024 | 01:46 PM

సెన్సేషన్ క్రియేట్ చేసిన హర్ష సాయి (Youtuber Harsha Sai)కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా హర్ష సాయి బాగోతాలను బయటపెడుతున్నారు.

harshasai

సెన్సేషన్ క్రియేట్ చేసిన హర్ష సాయి (Youtuber Harsha Sai)కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 'మెగా' సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసం హర్ష సాయి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాధితురాలు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా.. కాపీ రైట్స్ విషయంపై ఇద్దరి మధ్య వివాదం నెల్లకొంది. ఈ క్రమంలో బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి వీడియోలు హర్ష సాయి సీక్రెట్‌గా రికార్డు చేసినట్లు సమాచారం. మూవీ కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతానని హర్ష సాయి బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు సమాచారం.

Also Read- Nagarjuna: ఆ రోజు ఇండస్ట్రీని పట్టించుకోలేదు.. ఈ రోజు నీ వెంటే ఇండస్ట్రీ.. తేడా తెలిసిందా నాగ్


కాగా హర్ష సాయి గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. దీంతో కేసును ముమ్మరం చేసిన పోలీసులు హర్ష సాయిపై లుక్ అవుట్ నోటీసులు విడుదల చేశారు. మరోవైపు హర్ష సాయి విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. హర్ష సాయిపై ఇప్పటికే మరో అమ్మాయి ఆడియో లీక్ తో కలకలం రేపగా.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై కూడా వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా హర్ష సాయి బాగోతాలను బయటపెడుతున్నారు.

Also Read- Rajendra Prasad: పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యం రాజేంద్రుడికి ఆ దేవుడు ఇవ్వాలి


Also Read- Pawan Kalyan: అప్పుడు తిట్టినా కేసు లేదు.. ఇప్పుడు ఒక్కమాటకే పోలీసు కేసు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన బెట్టింగ్ యాప్స్ ఉపయోగించి అతను చాలా మందిని మోసం చేసాడు. తన స్వార్థం కోసం బెట్టింగ్ యాప్స్‌ను హర్ష సాయి ప్రమోషన్ చేశాడు. ఆ బెట్టింగ్ యాప్స్ నేను వాడానని ఫాలొవర్లను మోసం చేశాడు. మరికొందరి చేత అబద్దాలు చెప్పించాడు. దీంతో చాలా మంది బెట్టింగ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత కొందరికి డబ్బులు వచ్చాయి. తర్వాత డబ్బులు పోవడం మొదలైంది. అలా ఒక్కొక్కరు అలా నష్టపోయారు.

Updated Date - Oct 05 , 2024 | 01:46 PM