న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది!
ABN , Publish Date - Apr 28 , 2024 | 05:37 AM
అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఏ.డీ’. మే 9న విడుదల కావాల్సిన ఈ ప్రాజెక్ట్ పలు కారణాల వల్ల ఆ విడుదల తేదీని మార్చుకుంది...

అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఏ.డీ’. మే 9న విడుదల కావాల్సిన ఈ ప్రాజెక్ట్ పలు కారణాల వల్ల ఆ విడుదల తేదీని మార్చుకుంది. ఈ మూవీ లేటెస్ట్ రిలీజ్ డేట్‌ను శనివారం మేకర్స్ ప్రకటించారు. జూన్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌కు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీలతో కూడిన భారీ తారాగణం ఇందులో నటిస్తున్నారు. వైజయంతీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అశ్వనీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహా భారతంతో మొదలై క్రీస్తు శకం 2898లో పూర్తయ్యేలా, మొత్తం ఆరు వేల ఏళ్ల సంవత్సరాల వ్యవధిలో జరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన మూవీ గ్లింప్స్, అమితాబ్ క్యారెక్టర్ ఇంట్రో గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.