Robinhood: ‘రాబిన్‌హుడ్’ నుంచి రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్‌లుక్.. ఇది వేరే లెవల్!

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:04 PM

హీరో నితిన్ నటిస్తోన్న యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం రాజేంద్ర ప్రసాద్ బర్త్ డే. ఈ సందర్భంగా బర్త్‌డే విషెస్ తెలుపుతూ ‘రాబిన్‌హుడ్’ చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్‌ని మేకర్స్ వదిలారు.

Nata Kireeti Rajendra Prasad

హీరో నితిన్ (Nithiin) నటిస్తోన్న యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రాబిన్‌హుడ్‌’ (Robinhood). యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ (Nata Kireeti Rajendra Prasad) ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం రాజేంద్ర ప్రసాద్ బర్త్ డే. ఈ సందర్భంగా బర్త్‌డే విషెస్ తెలుపుతూ ‘రాబిన్‌హుడ్’ చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Also Read-Suman: ఏపీలో సినిమా ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే.. ఆ కండీషన్లు పెట్టకూడదు


‘రాబిన్‌హుడ్’ చిత్రంలో ఏజెంట్ జాన్ స్నో అకా జనార్ధన్ సున్నిపెంటగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్‌ని పరిచయం చేశారు. ఏజెంట్ గెటప్‌లో ఆయన కనిపించడం చాలా ఇంట్రస్టింగ్‌గా వుంది. ఈ ఏజ్‌లో కూడా ఆయనలా కనిపించడం అంటే మాములు విషయం కాదు. ఇందులో ఆయన క్యారెక్టర్ చాలా క్రూసియల్ అండ్ ఎంటర్‌టైనింగ్‌గా వుండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. (Nata Kireeti Rajendra Prasad Look In Robinhood)


Robinhood-Rajendra-Prasad.jpg

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయి ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్‌తో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు. టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సాయి శ్రీరామ్ డీవోపీ‌గా పని చేస్తుండగా.. జివి ప్రకాష్ కుమార్ సంగీతం, ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. (HBD Nata Kireeti Rajendra Prasad)

Read Latest Cinema News

Updated Date - Jul 19 , 2024 | 05:04 PM

Robinhood: క్రిస్మ‌స్‌కు.. నితిన్ రాబిన్‌హుడ్

Robinhood: నితిన్, వెంకీ కుడుముల సినిమాలో శ్రీలీలకు బదులు రాశి ఖన్నా

Robinhood: నితిన్ ‘రాబిన్‌హుడ్’ నుంచి కీలక అప్‌డేట్

Robinhood: ‘రాబిన్‌హుడ్’.. నితిన్ బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్

Robin Hood: ఆస్తులున్నవాళ్లంతా నా అన్నదమ్ముళ్లు.. నితిన్ ,వెంకీ కుడుముల కొత్త చిత్రం ‘రాబిన్‌హుడ్‌’