నార్నే నితిన్‌ నిశ్చితార్థం

ABN , Publish Date - Nov 04 , 2024 | 05:31 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది, టాలీవుడ్‌ యువ కథానాయకుడు నార్నే నితిన్‌ ఓ ఇంటివాడవ్వబోతున్నారు. తాళ్లూరి వెంకటకృష్ణ ప్రసాద్‌- స్వరూప దంపతుల కుమార్తె శివానిని నితిన్‌ పెళ్లాడనున్నారు...

జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది, టాలీవుడ్‌ యువ కథానాయకుడు నార్నే నితిన్‌ ఓ ఇంటివాడవ్వబోతున్నారు. తాళ్లూరి వెంకటకృష్ణ ప్రసాద్‌- స్వరూప దంపతుల కుమార్తె శివానిని నితిన్‌ పెళ్లాడనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన నిశ్చితార్థ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖలు పాల్గొన్నారు. ఈ వేడుకలో జూనియర్‌ ఎన్టీఆర్‌, ఆయన శ్రీమతి లక్ష్మీప్రణతి, కుమారులు అభయ్‌, భార్గవ్‌ ప్రత్యేకాకర్షణగా నిలిచారు. కల్యాణ్‌రామ్‌, వెంకటేశ్‌ ఈ వేడుకలో పాల్గొని కాబోయే వధువరులను ఆశీర్వదించారు. ‘మ్యాడ్‌, ఆయ్‌’ చిత్రాలతో నితిన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Updated Date - Nov 04 , 2024 | 05:31 AM