Nara and Konidela: నారా బ్రాహ్మణితో రామ్ చరణ్ మాట్లాడుతున్న ఫోటో వైరల్

ABN , Publish Date - Jun 12 , 2024 | 02:51 PM

ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఎన్నో అపురూప దృశ్యాలు అభిమానులను కనువిందు చేశాయి. అందులో రామ్ చరణ్ తో మాట్లాడుతున్న నారా బ్రాహ్మణి సన్నివేశం ఒకటి. ఆ ఫోటో, వీడియో ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Nara and Konidela: నారా బ్రాహ్మణితో రామ్ చరణ్ మాట్లాడుతున్న ఫోటో వైరల్
Nara Brahmini and Ram Charan

ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఎన్నో అపురూప దృశ్యాలు అభిమానులను కనువిందు చేశాయి. ప్రధాన మంత్రి మోదీ, అనేకమంది కేంద్ర మంత్రులు, చలనచిత్ర నటులు ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అయిన తరువాత ప్రధానమంత్రి మోదీ, పవన్ కళ్యాణ్ ని అతని అన్నయ్య చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లి ఆ ఇద్దరి అన్నదమ్ముల మధ్య మోదీ ఫోటోగ్రాఫర్లకి కనువిందు చేశారు.

అలాగే నందమూరి బాలకృష్ణ సభ మొత్తం తిరుగుతూ అందరినీ పలకరిస్తూ, తన అక్కలు ఇద్దరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించే సన్నివేశాలు కూడా అభిమానులను అలరించటమే కాకుండా, వారి అన్న చెల్లెల్ల అనుబంధాన్ని చూసి మురిసిపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ భార్య, కుమారుడు, కుమార్తె ఈ వేడుకకి రావటం అభిమానులకి కన్నుల పండగ అయింది.

pawankalyansondaughter.jpg

అలాగే ఈరోజు సిఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఇంకొక అగ్ర నటుడు రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. విజయవాడకి దగ్గరలో రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంటున్న 'గేమ్ చేంజర్' సినిమా నుంచి కొంచెం విరామం తీసుకొని గన్నవరం చేరుకున్నారు.

ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు రామ్ చరణ్ తన పక్కనే ఉన్న నారా బ్రాహ్మణితో మాట్లాడుతున్న వీడియో, ఫోటొలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో, మోదీ అటు చిరంజీవి ఇటు పవన్ లతో చేతులు పైకెత్తి అభివాదం చేయటాన్ని చూసి రామ్ చరణ్ భావోద్వేగానికి గురయ్యారు.

Updated Date - Jun 12 , 2024 | 03:25 PM