నందమూరి నాయకా...
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:18 AM
మహానటుడు ఎన్టీఆర్ మనవడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ‘హను-మాన్’ ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం
మహానటుడు ఎన్టీఆర్ మనవడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ‘హను-మాన్’ ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించే ఈ సినిమాను తేజస్విని, చెరుకూరి సుధాకర్ కలసి నిర్మిస్తున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజున ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పౌరాణిక గాథల స్ఫూర్తితో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. తాజాగా మోక్షజ్ఞ కొత్త స్టిల్‌ను శుక్రవారం విడుదల చేశారు. గడ్డం, చెక్ షర్ట్‌తో చాలా హాండ్‌సమ్‌గా కనిపించారు మోక్షజ్శ. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు చెప్పారు.