Chandrababu Swearing In: ఎటు చూసిన నందమూరి బాలకృష్ణ కనపడుతున్నారు

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:42 AM

హిందూపూర్ ఎంఎల్ఏ గా మూడోసారి ఎన్నికైన నటుడు నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చి, అతిధులను, తన కుటుంబ సభ్యులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, సభా ప్రాంగణం అంతా తిరుగుతూ కనిపించారు

Chandrababu Swearing In: ఎటు చూసిన నందమూరి బాలకృష్ణ కనపడుతున్నారు
Nandamuri Balakrishna and his sister Nara Bhuvaneswari

నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి సినిమా పరిశ్రమకి చెందిన ఎంతోమంది నటీనటులు హాజరయ్యారు. చిరంజీవి, రజినీకాంత్ లాంటి అగ్ర నటులు కుటుంబ సభ్యులతో విచ్చేసారు. అలాగే అగ్ర నటుడు, జనసేన అధినేత కూడా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రాంగణం అంతా వచ్చిన అతిధిలతో, జనాలతో కిక్కిరిసిపోతోంది.

nbalakrishna.jpg

ఇదిలా ఉండగా హిందూపూర్ ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ ఎక్కడ చూసినా అతనే కనపడుతున్నారు. మెగా స్టార్ చిరంజీవి వచ్చినప్పుడు అతనితో చేతులు కలిపి స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. అలాగే రజినీకాంత్ తో చేతులు కలిపి తమ స్నేహాన్నై తెలుపుకున్నారు. తన అల్లుడు నారా లోకేష్ ని ఆశీర్వదించి ముందుకు సాగారు.

నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సభా ప్రాంగణంలోకి వచ్చి కూర్చోగానే ఆమె దగ్గరికి వెళ్లి ఎంతో ఆప్యాయతతో తన సిస్టర్ ని నుదిటిపై ముద్దాడి ఆశీర్వదించారు. ఇంకో పక్క ఇంకో సిస్టర్ దగ్గుబాటి పురందరేశ్వరి దగ్గరికి వెళ్లి ఆమెని కూడా ఎంతో ఆప్యాయతతో పలకరించారు నందమూరి బాలకృష్ణ. మొత్తం ప్రాంగణం అంతా తానే అయి తిరుగుతూ, అందరినీ పలకరించుకుంటూ ఎంతో ఆనందంగా, ఆప్యాయతతో తిరుగుతున్నారు బాలకృష్ణ.

Updated Date - Jun 12 , 2024 | 11:42 AM