Kali: ‘కలి’ టీజర్ వదిలిన ‘కల్కి 2898 AD’ దర్శకుడు

ABN , Publish Date - Jul 07 , 2024 | 08:21 PM

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య హీరోలుగా నటిస్తున్న సినిమా ‘కలి’. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

యంగ్ హీరోలు ప్రిన్స్ (Prince), నరేష్ అగస్త్య (Naresh Agastya) హీరోలుగా నటిస్తున్న సినిమా ‘కలి’ (Kali). ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని.. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని ‘కల్కి 2898 AD’ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం.. ‘టీజర్ చాలా బాగుందని, ఒక కొత్త కాన్సెప్ట్‌‌ను దర్శకుడు శివ శేషు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని, ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటూ.. టీమ్ అందరికీ శుభాకాంక్షలు’ అని తెలిపారు నాగ్ అశ్విన్.

‘కలి’ మూవీ టీజర్ విషయానికి వస్తే.. స్వార్థం నిండిన ఈ లోకంలో బతకలేక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్ (ప్రిన్స్). ఉరి వేసుకునే సమయానికి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు. శివరామ్ జీవితంలో జరిగిన విషయాలన్ని ఆ వ్యక్తి చెబుతుంటాడు. తన జీవితంలో జరిగిన ఘటనలు ఆ అపరిచితుడికి ఎలా తెలిశాయని ఆశ్చర్యపోతాడు శివరామ్. పెళ్లి చేసుకుని సంతోషంగా భార్యతో ఉన్న శివరామ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు? అతని ఇంటికి వచ్చిన అపరిచితుడు ఎవరు? అతనికి శివరామ్ జీవితంలో విషయాలన్నీ ఎలా తెలిశాయి? కళ్లముందే శివరామ్ ఉంటే అతని పోలిక ఉన్న డెడ్ బాడీ ఎలా వచ్చింది? ఇలాంటి ఆసక్తికర అంశాలను రేకెత్తించేలా ఈ టీజర్‌ని కట్ చేశారు. (Kali Movie Teaser Launched)


Prince.jpg

టీజర్ విడుదల సందర్భంగా చిత్ర సమర్పకులు కె. రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ.. మా చిత్ర టీజర్‌ను విడుదల చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు ధన్యవాదాలు. ‘కలి’ పాత్ర నేపథ్యంతో సాగే ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలపగా.. చిత్ర నిర్మాత లీలా గౌతం వర్మ మాట్లాడుతూ.. దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో బిజీగా ఉన్నా మాకు టైమ్ ఇచ్చి మా మూవీ టీజర్‌ను లాంఛ్ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ అని అన్నారు. మైథాలజీ, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్స్ కలిపిన చిత్రమిదని రచయిత మరియు డైరెక్టర్ శివ శేషు తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Jul 07 , 2024 | 08:21 PM