MixUpOnAha: మరీ ఇంత పచ్చిగా తీశారేంటి.. ఆ స్టార్ హీరోయిన్ బోల్డ్ సినిమాకు కాపీనా
ABN , Publish Date - Mar 08 , 2024 | 07:58 PM
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా తాజాగా నిర్మించిన చిత్రం మిక్సప్. పూర్తిగా రొమాంటిక్, బోల్డ్ కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను చూసి గతంలో ఓ ఓటీటీలో వచ్చిన సినిమాకు కాపీలా ఉందంటూ చేస్తున్న కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బిగ్‌బాస్ ఫేం ఆదర్శ్ బాలకృష్ణన్ (Aadarsh B Krishna), కమల్ కామరాజు (Kamal Kamaraju), పూజా జవేరి (Pooja J Jhaveri), అక్షర గౌడ (Akshara Gowda) ప్రధాన పాత్రల్లో ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ నిర్మించిన చిత్రం మిక్సప్ (MixUp On Aha). పూర్తిగా రొమాంటిక్, బోల్డ్ కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం టీజర్‌ను గత నెలలో విడుదల చేయగా మంచి స్పందననే తెచ్చుకుంది. తాజాగా ఈ రోజు (శుక్రవారం) సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఆహా (Aha)లో స్ట్రీమింగ్ కానుంది.
గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకుణే (Deepika Padukone), అనన్యా పాండే (Ananya Panday), సిద్ధాంత్ చతుర్వేది (Siddhant Chaturvedi) కాంబినేషన్‌లో పూర్తిగా లస్ట్, రొమాంటిక్ జానర్‌లోనే రూపొంది సంచలనం సృష్టించిన చిత్రం గెహరియాన్ (Gehraiyaan). దాదాపు అదే తరహాలో ఇప్పుడు ఆహా (Aha) కూడా మిక్సప్ అనే ఒరిజినల్ మూవీని తీసుకువస్తున్నట్లు నే నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో లాగానే ఇందులోనూ.. పెళ్లైన రెండు జంటలకు వారి రొటీన్ లైఫ్ బోర్ కొట్టడం అవతలి జంటపై లస్ట్ పెరిగి ఒక్కడవడం వంటి కాన్సెప్ట్‌తోనే ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఓటీటీ ప్రారంభంలో ఇలాంటి ఒకటి రెండు బోల్డ్ సినిమాలు తీసుకువచ్చిన ఆహా ఓటీటీ మళ్లీ ఇన్నాళ్ల తర్వాత పూర్తిగా అడల్ట్ కంటెంట్‌తో కాస్త పేరున్న నటీ నటులతో రూపొందించిన ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేయనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమా మొత్తం ఓ పెళ్లైన జంట, ఓ లవ్‌లో ఉన్న జంట చుట్టూ తిరుగుతూ ఇంటిమేట్ సన్నివేశాలతో పాటు, డబుల్ మీనింగ్ డౌలాగ్స్ కూడా బాగానే దట్టించినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్, బిగ్‌బాస్ షోతో పేరు తెచ్చుకున్న ఆదర్శ్ బాలకృష్ణన్ (Aadarsh B Krishna), అవకాయ్ బిర్యానీలో హీరోగా చేసి తర్వాత క్యారెక్టర్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కమల్ కామరాజు (Kamal Kamaraju), విజయ్ దేవరకొండ ద్వారక సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగులో నాలుగైదు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసిన పూజా ఝవేరి (Pooja J Jhaveri), దాస్ కా ధమ్కీ, స్కంధ వంటి చిత్రాల్లో చిన్న క్యారెక్టర్లలో నటించిన ఒకప్పటి కన్నడ అగ్రతార అక్షర గౌడ(Akshara Gowda)వంటి వారు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించడం విశేషం.