Naari: మంత్రి సీతక్క వదిలిన ‘నారి’ గ్లింప్స్.. మూవీ విడుదల ఎప్పుడంటే
ABN , Publish Date - Nov 30 , 2024 | 07:54 PM
మహిళలు ఎన్నో రంగాలలో దూసుకుపోతున్నప్పటికీ ఇంకా వారి పట్ల వివక్ష, చిన్నచూపు తగ్గడం లేదని.. సమాజ నిర్మాతలు మహిళలే అనే నిజాన్ని అందరూ గుర్తుపెట్టుకుని.. ఆడ పిల్లలు ఎదిగేందుకు ప్రతి ఒక్కరు తోడ్పాటును అందించాలని కోరారు తెలంగాణ మినిస్టర్ సీతక్క. ‘నారి’ చిత్ర టైటిల్ లుక్, గ్లింప్స్‌ని ఆమె విడుదల చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నారి’. ‘మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలు అన్ని రంగాలలో ఎదిగేందుకు సహకరించాలి’ అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. నిర్మాత శశి వంటిపల్లి నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌ను తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క విడుదల చేసిన చిత్రయూనిట్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందించారు.
Also Read-Allu Arjun: ఆర్మీ తెచ్చిన తంట.. అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలు ఎన్నో రంగాలలో ఎదుగుతున్నారు. అయినప్పటికీ ఇంకా మహిళల పట్ల వివక్ష, చిన్నచూపు తగ్గడం లేదు. సమాజ నిర్మాతలు మహిళలే అనే నిజాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆడ పిల్లలు ఎదిగేందుకు ప్రతి ఒక్కరు తోడ్పాటును అందించాలి. మహిళల్ని గౌరవించాలి. ఇలాంటి గొప్ప కాన్సెప్ట్‌తో ‘నారి’ సినిమా చేసిన సూర్య వంటిపల్లికి అభినందనలు. ఈ సినిమా పోస్టర్, గ్లింప్స్ నా చేతుల మీదుగా విడుదలవడం సంతోషంగా ఉంది. ‘నారి’ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి. ఈ టీమ్ మహిళలపై మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.
అనంతరం దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ.. మా మూవీ టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌ని విడుదల చేసిన మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు. మేడమ్ ఎంతో బిజీగా ఉన్నా మా మూవీ కాన్సెప్ట్ విని టైమ్ ఇచ్చారు. ఇటీవల ఓ స్కూల్ అమ్మాయి తన టీచర్‌తో అమ్మాయిగా తన కష్టాలు చెబుతూ.. తాను మగవాడిగా మారాలని అనుకుంటున్నట్లు చెప్పిన వీడియో ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ సన్నివేశం మా ‘నారి’ సినిమాలోనిది. ఆ అమ్మాయి నిత్యశ్రీ. మహిళల పట్ల మనం ఎలా వ్యవహరించాలి. వారికి ఎలా సపోర్ట్ చేయాలనే మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించాము. డిసెంబర్ 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి మహిళ తమ ఇంట్లోని పురుషుడిని వెంట తీసుకెళ్లి మరీ ఈ సినిమాను చూపించాలని కోరుతున్నానని తెలిపారు.
Also Read- Allu Arjun: నన్ను స్టార్‌ను చేసింది ఆయనే..
Also Read-Chai Sobhita: డోల్ డోల్ డోల్ భాజే.. అక్కినేని ఇంట్లో సంబరాలే
Also Read-Prashanth Varma: సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే.. గెట్ రెడీ ఫర్ 'మోక్షజ్ఞ'
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి