Indra Re-Release: మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌గా.. ‘ఇంద్ర’ రీ రిలీజ్

ABN , Publish Date - Jul 24 , 2024 | 05:57 PM

మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో మెగాస్టార్ చిరు నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఇంద్ర’ సినిమాను రీ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. లాస్ట్ ఇయర్ చిరంజీవి బర్త్‌డేకి ప్లాన్ చేసి.. చివరి నిమిషంలో విరమించుకున్నారు. కానీ ఈసారి మాత్రం అలాకాదు.. ముందుగానే అన్నీ సిద్ధం చేసి ‘ఇంద్ర’ రీ-రిలీజ్ ప్రకటన కూడా చేసేశారు. చిరంజీవి బర్త్‌డేను పురస్కరించుకుని ఆగస్ట్ 22న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా వైజయంతీ మేకర్స్ ప్రకటించారు.

Megastar Chiranjeevi in Indra Movie

ఈ మధ్య టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో సైతం రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పటి కల్ట్ క్లాసిక్ మూవీస్‌ని ఫ్యాన్స్ కోసం ఫ్యాన్సే రీ రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ రీ రిలీజ్‌లో కూడా ఆ సినిమాలు రికార్డ్ కలెక్షన్స్‌ని వసూలు చేస్తుండటంతో.. ఈ రీ-రిలీజ్‌ల హవా మరింతగా పెరిగిపోతోంది. అయితే మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఇంద్ర’ (Indra) సినిమాను రీ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. లాస్ట్ ఇయర్ చిరంజీవి బర్త్‌డేకి ప్లాన్ చేసి.. చివరి నిమిషంలో విరమించుకున్నారు. కానీ ఈసారి మాత్రం అలాకాదు.. ముందుగానే అన్నీ సిద్ధం చేసి ‘ఇంద్ర’ రీ-రిలీజ్ (Indra Re-Release) ప్రకటన కూడా చేసేశారు. మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 22న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా వైజయంతీ మేకర్స్ ప్రకటించారు.

Also Read- Anasuya: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంతో డ్యాన్స్ నెంబర్ చేశా..

అశ్వనీ‌దత్ వైజయంతి మూవీస్ 50 గోల్డెన్ ఇయర్స్‌ని సెలబ్రేట్ చేస్తూ, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఇంద్ర’ను గ్రాండ్ రీ-రిలీజ్‌‌కు తెస్తున్నారు. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై జూలై 24కి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ‘ఇంద్ర’ సినిమా 2002లో జూలై 24న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ సినిమాగా అప్పట్లో రికార్డ్‌ని క్రియేట్ చేసింది. (Indra Movie Re Release on Chiranjeevi Birthday)


Megastar-Indra.jpg

ఈ సినిమా మూడు నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ సౌత్‌ అవార్డులను గెలుచుకుంది. చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డు, తెలుగు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు రెండింటినీ గెలుచుకున్నారు. చిరంజీవితో వైజయంతీ మూవీస్ అనేక బ్లాక్‌బస్టర్‌లను నిర్మించింది. ‘ఇంద్ర’ సినిమా ఆ బ్యానర్‌కు మోస్ట్ మెమరబుల్ మూవీ. ఈ చిత్రానికి VSR స్వామి సినిమాటోగ్రఫీ అందించగా, మణి శర్మ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆర్తీ అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు.

Read Latest Cinema News

Updated Date - Jul 24 , 2024 | 05:57 PM