Matka: వరుణ్ తేజ్ ‘మట్కా’.. ఒక్క ఫేజ్‌కే రూ. 15 కోట్లు..

ABN , Publish Date - Jun 26 , 2024 | 04:49 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మట్కా’ ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇది 35 రోజుల లాంగ్ షూటింగ్ షెడ్యూల్ అనే విషయాన్ని మేకర్స్ ముందుగానే తెలియజేశారు. ఈ ఒక్క ఫేజ్‌కే సుమారు రూ. 15 కోట్ల మ్యాసీవ్ బడ్జెట్‌ను కేటాయించినట్లుగా సమాచారం. ప్రొడక్షన్ టీం వింటేజ్ వైజాగ్ లోకేషన్స్‌ని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో మ్యాసీవ్ సెట్‌లలో రిక్రియేట్ చేస్తోంది.

Matka: వరుణ్ తేజ్ ‘మట్కా’.. ఒక్క ఫేజ్‌కే రూ. 15 కోట్లు..
Mega Prince Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మట్కా’ (Matka) ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇది 35 రోజుల లాంగ్ షూటింగ్ షెడ్యూల్ అనే విషయాన్ని మేకర్స్ ముందుగానే తెలియజేశారు. ఈ ఒక్క ఫేజ్‌కే సుమారు రూ. 15 కోట్ల మ్యాసీవ్ బడ్జెట్‌ను కేటాయించినట్లుగా సమాచారం. ప్రొడక్షన్ టీం వింటేజ్ వైజాగ్ లోకేషన్స్‌ని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో మ్యాసీవ్ సెట్‌లలో రిక్రియేట్ చేస్తోంది. ప్రేక్షకులకు అథెంటిసిటీ, గ్రాండియర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించే లక్ష్యంతో చిత్ర టీం వర్క్ చేస్తోంది.

Also Read-Kalki 2898AD Review: మహాభారత యుద్ధం తరువాత ఏమి జరిగిందో ఊహాత్మకంగా...

‘మట్కా’ హై బడ్జెట్‌ పాన్-ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. వింటేజ్ సెట్లలో ఇన్వెస్ట్మెంట్ విజువల్ వండర్‌ని తలపించేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైజాగ్‌లోని ఎసెన్స్‌ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ సెట్‌లు సినిమా హైలైట్‌లలో ఒకటిగా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. మేకింగ్ వీడియో ఇంటెన్సీవ్ ప్రీ-ప్రొడక్షన్, గ్రాండ్-స్కేల్ మేకింగ్‌ను తెలియజేస్తోంది. ఇందులో వరుణ్ తేజ్ గ్లింప్స్ కూడా చూపించారు. వెర్సటైల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకునే వరుణ్ తేజ్ ‘మట్కా’లో మరో మరపురాని పాత్రకు జీవం పోయనున్నారు. ఈ చిత్రంలో అతని పాత్ర దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.


Varun-Tej-Mega-Prince.jpg

దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు కరుణ కుమార్ (Karuna Kumar) ఈ సినిమా కోసం మ్యాసీవ్ స్క్రిప్ట్‌ను రూపొందించారు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటి నోరా ఫతేహి (Norah Fatehi) ఓ కీలక పాత్రలో కనిపించనుంది. హ్యుజ్ బడ్జెట్‌తో నిర్మించిన సెట్స్‌తో పాటు యూనిక్ కాన్సెప్ట్‌తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 26 , 2024 | 04:49 PM