Meenakshi Chaudhary: బాబోయ్ మీనాక్షి, ఆ లైనప్ చూశారా...

ABN , Publish Date - Jul 22 , 2024 | 06:52 PM

ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన 'గుంటూరు కారం' లో మహేష్ బాబు పక్కన అతని మరదలిగా పల్లెటూరి అమ్మాయిలా నటించిన మీనాక్షి చౌదరి, తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకర్షించింది. ఇప్పుడు తెలుగు, తమిళంలో సూపర్ స్టార్స్, మెగా స్టార్స్ పక్కన సినిమాలు చేస్తున్న మీనాక్షి బిజీ నటీమణుల్లో ఒక నటీమణి అయింది

Meenakshi Chaudhary

ఇప్పుడు దక్షిణాదిలో బాగా డిమాండ్ వున్న నటీమణుల్లో మీనాక్షి చౌదరి ఒకరు. 'హిట్: ది సెకండ్ కేస్' లో అడివి శేష్ పక్కన నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరస సినిమాలతో చాలా బిజీగా వున్న నటీమణి అయిపొయింది. దక్షిణాదిలో మీనాక్షికి ఉన్నంత డిమాండ్ మరే నటీమణికి ఇప్పుడు లేదేమో అనిపిస్తోంది. (Meenakshi Chaudhary is busy with big projects in Down South)

meenakshichaudharyphototwo.jpg

'ఇక్కడ వాహనములు నిలుపరాదు' అనే సినిమాతో తెలుగులో మూడేళ్ళ క్రితం ఆరంగేట్రం చేసిన మీనాక్షి తరువాత రెండేళ్లలో పెద్దగా సినిమాలు ఏమీ చెయ్యలేదు. అయితే ఈ సంవత్సరం విడుదలైన 'గుంటూరు కారం' మీనాక్షి కెరీర్ ని పూర్తిగా మార్చేసింది అనే చెప్పాలి. మహేష్ బాబు పక్కన నటించిన ఈ హర్యానాకి చెందిన చిన్నది, పల్లెటూరి అమ్మాయిలా, తెలుగమ్మాయిలా ప్రేక్షకులకి నచ్చేసింది అనే చెప్పాలి. (Meenakshi Chaudhary gets a project from big stars like Vijay and Chiranjeevi in Tamil and Telugu)

meenakshichaudharyphotoone.jpg

అంతే ఒక్కసారిగా వరస సినిమాలతో బిజీ అయిపొయింది. ఇప్పుడు మీనాక్షి లైనప్ చూస్తుంటే ఆమ్మో మీనాక్షి సినిమాలతో, అటు తమిళం, ఇటు తెలుగులోనూ బాగా డిమాండ్ వున్న నటీమణి అయిపొయింది. (After 'Guntur Kaaram', Meenakshi is now one of the busiest actresses in Down South)

meenakshichaudharyfour.jpg

'సింగపూర్ సెలూన్' అనే తమిళ సినిమాలో మీనాక్షి నటిస్తోంది. తరువాత మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో చేస్తున్న 'లక్కీ భాస్కర్' సినిమాలో దుల్కర్ పక్కన కథానాయికగా నటిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే తమిళ సూపర్ స్టార్ విజయ్ పక్కన 'గోట్: గ్రేటెస్ట్ అఫ్ అల్ టైమ్' అనే సినిమాలో విజయ్ పక్కన కథానాయికగా నటిస్తోంది. ఇది ఆమెకి చాలా పెద్ద సినిమా అనే చెప్పాలి. (Meenakshi Chaudhary is bagged a project opposite Tamil Super Star Vijay and Malayalam Super Star Dulquer Salman)

meenakshichaudharyphotothre.jpg

ఆ తరువాత తెలుగులో మెగా స్టార్ చిరంజీవి పక్కన ఒక కథానాయికగా 'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది. ఇది ఇంకా పెద్ద సినిమా అనే చెప్పాలి. అటు అందం, ఇటు అభినయం రెండింటిలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్న మీనాక్షి విశ్వక్ సేన్ పక్కన 'మెకానిక్ రాకీ' సినిమాలో కథానాయికగా చేస్తోంది.

meenakshichaudharyphoto.jpg

ఇవన్నీ కాకుండా 'పలాస' ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న 'మట్కా' సినిమాలో కూడా మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఇలా వరస సినిమాలతో రానున్న రోజుల్లో నెలకు ఒక సినిమా అయినా మీనాక్షి చౌదరివి విడుదల అయ్యేట్టుగా వున్నాయి. ఇంకేముంది మీనాక్షి ఇప్పుడు బిజీగా వున్న నటీమణుల్లో ఒక నటీమణి అయిపొయింది.

meenakshichaudharyfive.jpg

Updated Date - Jul 22 , 2024 | 06:52 PM