మ్యాక్స్ ఆగమనం అప్పుడే
ABN , Publish Date - Dec 19 , 2024 | 06:13 AM
కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మ్యాక్స్’. వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో కలైపులి.ఎస్.థాను నిర్మించారు...
కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మ్యాక్స్’. వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో కలైపులి.ఎస్.థాను నిర్మించారు. ఈ నెల 27న తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్నట్లు యూనిట్ ప్రకటించింది. సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు హక్కులను పొందింది. పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో సుదీప్ నటన ప్రేక్షకులను అలరిస్తుందని యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోకనాథ్, సినిమాటోగ్రఫీ: శేఖర్ చంద్ర