Rao Ramesh: జంధ్యాల మార్కు చిత్రంగా రావు రమేష్ 'మారుతి నగర్ సుబ్రమణ్యం'

ABN , Publish Date - Jul 25 , 2024 | 12:59 PM

దర్శకుడు లక్ష్మణ్ కార్య, ప్రముఖ క్యారెక్టర్ నటుడు రావు రమేష్ ని ప్రధాన పాత్రలో చూపిస్తూ చేసిన సినిమా 'మారుతీనగర్ సుబ్రమణ్యం'. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ చూసి, నచ్చి, విడుదల చెయ్యడానికి ముందుకు వచ్చినట్టుగా తాజా సమాచారం. ఇది ఒక జంధ్యాల మార్కు సినిమాగా ఆహ్లాదంగా, హాస్యభరితంగా ఉండబోతోందని అంటున్నారు.

A still from Maruthinagar Subramanyam

దర్శకుడు లక్ష్మణ్ కార్య ఇంతకు ముందు 'హ్యాపీ వెడ్డింగ్' అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా ఆశించినంతగా నడవలేదు, కానీ లక్ష్మణ్ కార్య దర్శకత్వ పటిమ ఏంటో ఆ సినిమా ద్వారా తెలిసింది. అందుకే ఇప్పుడు రెండో సినిమాగా 'మారుతీనగర్ సుబ్రమణ్యం' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి లక్ష్మణ్ కార్య దర్శకత్వంతో పాటు, రచన, మాటలు, స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ సినిమా త్వరలోనే విడుదలవుతుందని తెలుస్తోంది. (Rao Ramesh is playing first time as a lead actor in Maruthinagar Subramanyam directed by Lakshman Karya)

అయితే ఈ సినిమా గురించి పరిశ్రమలో ఒక టాక్ బయలుదేరింది. అదేంటంటే ఈ సినిమాని ఇప్పటికే కొంతమంది పరిశ్రమలోని వారు చూసారని, ఈ సినిమా చూసిన తరువాత నవ్వకుండా ఉండలేరు అని అంటున్నారు. ఈ సినిమాలో రావు రమేష్ ప్రధాన పాత్ర పోషించారు. మామూలుగానే ప్రేక్షకులు ఒక సినిమాలో క్యారెక్టర్ పాత్రలో కనపడే రావు రమేష్ చెప్పిన మాటలని ఎంతో ఆస్వాదిస్తారు, అలాంటిది ఇప్పుడు అయన ప్రధాన పాత్రలో చేస్తున్న సినిమాలో అతని చెప్పే మాటలకి పడి పడి నవ్వాల్సిందే అని ఈ సినిమా చూసిన వాళ్ళు చెపుతున్నారు. (Marthinagar Subramanyam is going to be like a Jandhyala Mark film with lot of fun)

raorameshmaruthinagarsubram.jpg

ఇంకొక ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్ కూడా చూసారని, అందుకే వాళ్ళు ఈ సినిమాని టేక్ అప్ చేసారని ఒక వార్త నడుస్తోంది. అలాగే ఈ సినిమా ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా చూసి ఎంతో ఆస్వాదించారని తెలుస్తోంది. ఇందులో రావు రమేష్ లాంటి నటుడికి ఒక ఫుల్ లెంగ్త్ రోల్ ఇస్తే తన మాటలతో ఎలా ప్రేక్షకులని మంత్రం ముగ్దుల్ని చేస్తాడో ఈ సినిమా నిరూపిస్తుంది అని కూడా అంటున్నారు. (After Maruthinagar Subramanyam, director Lakshman Karya is going to become a big director, says a source)

ఏ సినిమా చూసినా ఏమున్నది గర్వకారణం, తలలు తెగడం, మొండాలు పడటం, చేతులు, కాళ్ళు నరుక్కోవటం, తెరపైన రక్తం చూడటం, ఇలా ఎక్కువ పోరాట సన్నివేశాలతో చాలా సినిమాలు వస్తున్నాయి. నరుక్కోవటం, పొడుచుకోవటం లాంటి సినిమాలతో ప్రేక్షకుడికి ఊపిరి ఆడక ఉన్నటువంటి ఈ సమయంలో ఈ 'మారుతీనగర్ సుబ్రమణ్యం' ప్రాణవాయువు లాంటిదని అంటున్నారు. (Popular production house Mythri Movie Makers is going to take up Maruthinagar Subramanyam after they have seen the film and liked it very much) 'ఇది ఒక జంధ్యాల మార్కు సినిమాలా ఉంటుంది' అని ఈ సినిమా చూసిన వ్యక్తులు అన్నారు. దర్శకుడు జంధ్యాల సునిశితమైన హాస్యంతో తనదైన శైలితో ప్రేక్షకులను తన సినిమాలతో కడుపుబ్బా నవ్వించేవారు, ఇప్పుడు అలాంటి సినిమాలు కరువయ్యాయి, కానీ ఈ 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమాతో ఆ కరువు తీరిపోతుంది అని అంటున్నారు.

raorameshmaruthinagar.jpg

అలాగే ఇంత వరకు క్యారెక్టర్ పాత్రలు వేస్తూ వచ్చిన రావు రమేష్ ఈ సినిమాతో ప్రధానపాత్రలో కనపడుతున్నారు. ఈ సినిమా విడుదలైన తరువాత రావు రమేష్ ప్రధాన పాత్రలో మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మధ్య తరగతి కుటుంబాలకి చెందిన కథలు ఈమధ్య రావటం మానేశాయి, ఈ 'మారుతీనగర్ సుబ్రమణ్యం' తో అటువంటి సినిమాలకి శ్రీకారం జరుగుతుందని పరిశ్రమలో అనుకుంటున్నారు. రావు రమేష్ తో పాటు, దర్శకుడు లక్ష్మణ్ కార్య ఈ సినిమాతో ఒక మంచి దర్శకుడిగా పరిశ్రమలో నిలదొక్కుకునే అవకాశం వుంది అని కూడా అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు అందరినీ అలరించాయి, ట్రేండింగ్ కూడా అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు మూడో వారంలో విడుదల కావచ్చు అని అంటున్నారు.

Updated Date - Jul 25 , 2024 | 01:03 PM