పెళ్లి చేసుకున్న అమీ జాక్సన్‌

ABN , Publish Date - Aug 26 , 2024 | 05:59 AM

హీరోయిన్‌ అమీ జాక్సన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హాలీవుడ్‌ నటుడు ఎడ్‌ వెస్ట్‌విక్‌తో ఏడడుగులు వేశారు. వీరి వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది....

హీరోయిన్‌ అమీ జాక్సన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హాలీవుడ్‌ నటుడు ఎడ్‌ వెస్ట్‌విక్‌తో ఏడడుగులు వేశారు. వీరి వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను వారు ఆదివారం ఇన్‌గ్రామ్‌లో పోస్ట్‌ చేసి.. ‘‘ప్రయాణం ఇప్పుడే మొదలైంది’’ అని పేర్కొన్నారు. కాగా, అమీ జాక్సన్‌ గతంలో ఇంగ్లాండ్‌కు చెందిన జార్జ్‌ అనే వ్యక్తితో కొంతకాలం లివింగ్‌ రిలేషన్‌లో ఉండి.. ఓ బిడ్డను కూడా కన్నారు. 2022లో వారు విడిపోయారు.

Updated Date - Aug 26 , 2024 | 05:59 AM