థియేటర్లలో పెళ్ళి... మంచి పద్ధతి కాదు
ABN , Publish Date - Aug 12 , 2024 | 03:09 AM
థియేటర్లలో పెళ్లిళ్లు చేసుకునే పద్ధతి మంచిది కాదని దర్శకుడు కృష్ణవంశీ హితవు పలికారు. ఆయన దర్శకత్వం వహించిన ‘మురారి’ చిత్రం ఇటీవలే రీ రిలీజైన సందర్భంగా...
థియేటర్లలో పెళ్లిళ్లు చేసుకునే పద్ధతి మంచిది కాదని దర్శకుడు కృష్ణవంశీ హితవు పలికారు. ఆయన దర్శకత్వం వహించిన ‘మురారి’ చిత్రం ఇటీవలే రీ రిలీజైన సందర్భంగా ఓ ప్రేమజంట థియేటర్‌లోనే పెళ్లి చేసుకుంది. నెటి జన్లు ఆ వీడియోలను కృష్ణవంశీకి ట్యాగ్ చేస్తూ షేర్ చేస్తున్నారు. దీంతో ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. ‘మన సంస్కృతి, సంప్రదాయాలను కించ పరచొద్దు. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇలాంటి పనులు చేయకండి. అవగాహన లేక వారిద్దరూ అలా చేసి ఉంటారు. వారికి మంచి భవిష్యత్ ఉండాలి’ అని ఆకాంక్షించారు.