మహేశ్‌బాబు ఎంజాయ్‌ చేశారు

ABN , Publish Date - Dec 02 , 2024 | 05:47 AM

2019లో వచ్చిన ‘ది లయన్‌ కింగ్‌’ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’. బారీ జెన్‌కిన్స్‌ దర్శకత్వం వహించారు. వాల్ట్‌ డిస్నీ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న...

2019లో వచ్చిన ‘ది లయన్‌ కింగ్‌’ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’. బారీ జెన్‌కిన్స్‌ దర్శకత్వం వహించారు. వాల్ట్‌ డిస్నీ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో ముఫాసా పాత్రకు హీరో మహేశ్‌బాబు డబ్బింగ్‌ చెప్పారు. ఆదివారం చిత్రబృందం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ముఫాసా, మహేశ్‌బాబు ప్రచార చిత్రాన్ని నమ్రతా శిరోద్కర్‌ ఘట్టమనేని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘డిస్నీ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చిత్రమిది. ఇలాంటి మంచి సినిమాను ఔచిత్యం చెడకుండా డబ్‌ చేయడం ఓ సవాల్‌ అనే చెప్పాలి. డిస్నీ సంస్థ చాలా శ్రమించి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.


చాలా ఎంజాయ్‌ చేస్తూ ‘ముఫాసా’ పాత్రకు మహేశ్‌బాబు డబ్బింగ్‌ చెప్పారు. ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’ అన్నారు. ఈ సందర్భంగా ముఫాసా చిత్రబృందం రూపొందించిన మహేశ్‌బాబు పోస్టర్‌ను నమ్రత ఆవిష్కరించారు. సత్యదేవ్‌, అలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 05:47 AM