చైనాలో ‘మహారాజా’ విడుదల

ABN , Publish Date - Nov 27 , 2024 | 06:20 AM

తమిళ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మహారాజా’ చైనాలో ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ చిత్రానికి నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించారు. విజయ్‌సేతుపతి, అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌...

తమిళ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మహారాజా’ చైనాలో ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ చిత్రానికి నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించారు. విజయ్‌సేతుపతి, అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌ కీలక పాత్రల్లో నటించారు. చైనాలో నాలుగేళ్ల తర్వాత విడుదలవుతున్న భారతీయ చిత్రమిది. ఇప్పటికే చైనాలో ప్రీవ్యూ షోస్‌ వేశారు. వీటికి అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ ఊహించని మలుపులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. చైనీస్‌ మూవీ రివ్యూ సైట్‌ ‘దౌబన్‌’ ఈ సినిమాకు 8.7/10 రేటింగ్‌ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో భారతీయ సినిమాకు ఇంత భారీ రేటింగ్‌ లభించడం ఇదే తొలిసారి.

Updated Date - Nov 27 , 2024 | 06:20 AM