Lucy: మహదేవ్ చిరంజీవి ‘లూసీ’ ఫస్ట్ లుక్ విడుదల

ABN , Publish Date - Jul 29 , 2024 | 10:22 PM

ఆండాలమ్మ పిక్చర్స్ మరియు నియోన్ క్రియేషన్స్ పతాకంపై చరణ్ గోపరాజు, శశాంక్ బాలు, ప్రశాంతి ముఖ్య పాత్రధారులుగా.. మహదేవ్ చిరంజీవి దర్శకత్వంలో ఆశిష్, కిరణ్, ప్రవీణ్ ఆమంచ సంయుక్తంగా నిర్మించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘లూసీ’. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను రీసెంట్‌గా హైదరాబాద్‌లో చిత్రయూనిట్ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Lucy First Look Launch Event

ఆండాలమ్మ పిక్చర్స్ మరియు నియోన్ క్రియేషన్స్ పతాకంపై చరణ్ గోపరాజు, శశాంక్ బాలు, ప్రశాంతి ముఖ్య పాత్రధారులుగా.. మహదేవ్ చిరంజీవి దర్శకత్వంలో ఆశిష్, కిరణ్, ప్రవీణ్ ఆమంచ సంయుక్తంగా నిర్మించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘లూసీ’ (Lucy). అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను రీసెంట్‌గా హైదరాబాద్‌లో చిత్రయూనిట్ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. (Lucy First Look Launched)

ఈ సందర్భంగా డైరెక్టర్ మహదేవ్ చిరంజీవి (Mahadev Chiranjeevi) మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకు నేను డైరెక్షన్ అండ్ రైటింగ్‌తో పాటు కెమెరామెన్‌గా కూడా వ్యవహరించాను. మా సినిమాకు అన్ని చక్కగా కుదిరాయి. మా నిర్మాతలు ఆశిష్, కిరణ్ అండ్ ప్రవీణ్ ఆమంచ నన్ను నమ్మి, నాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అతి త్వరలోనే టీజర్ లాంచ్ చేయడానికి సలహాలు చేస్తున్నాము. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామని అన్నారు.


Lucy-First-Look.jpg

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి మహదేవ్ కష్టపడేతత్వం ఉన్న వ్యక్తి. సో అందుకే మేము ఆయనతో జర్నీ స్టార్ట్ చేశాం. ఈ చిత్రం చూసిన తర్వాత హిట్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. ఫ్యూచర్లో ఆయన మరిన్ని మంచి చిత్రాలు తీయాలని మేము కోరుకుంటున్నాం. ‘లూసీ’ ప్రమోషన్స్ స్టార్ట్ చేశాం. త్వరలోనే టీజర్ విడుదల చేసి మరింతగా ప్రమోషన్స్ చేయబోతున్నామని అన్నారు. ఈ సినిమా సరికొత్త కంటెంట్‌తో తెరకెక్కింది. తప్పకుండా ప్రతి ఒక్కరినీ ఎంగేజ్ చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోలు చరణ్, శశాంక్.. హీరోయిన్ ప్రశాంతి, సంగీత దర్శకుడు సందీప్ ప్రభాకర్ మాట్లాడారు.

Read Latest Cinema News

Updated Date - Jul 29 , 2024 | 10:22 PM