Maha Sandram: ‘మహా సంద్రం’ మూవీ మొదలైంది..
ABN , Publish Date - Nov 16 , 2024 | 08:34 AM
ప్రస్తుతం కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్‌ని ఎలా షేక్ చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. స్టార్స్ అనే కాకుండా కొత్త తరం నటులు కూడా డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడలాంటి జాబితాలోకే మా చిత్రం కూడా చేరుతుందని అంటున్నారు ‘మహా సంద్రం’ చిత్ర నిర్మాతలు. ఈ సినిమా కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవ విశేషాలివే..
వీవీఎం క్రియేషన్స్, కేవీఎం ఆర్ట్స్ ఎల్ఎల్‌పి బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మహా సంద్రం’. నవీనీత్ రైనా హీరోగా నటించబోతోన్న ఈ చిత్రాన్ని శేషు రావెళ్ళ, కార్తికేయ. వి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వం కార్తికేయ వి. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను శుక్రవారం, కార్తీక పౌర్ణమి శుభదినాన గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు దామోదర ప్రసాద్, ఎన్. శంకర్, సముద్ర, ఆర్. అనిల్ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Also Read- Rana Daggubati: పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం లేదు..
చిత్ర పూజా కార్యక్రమాల అనంతరం దామోదర ప్రసాద్ క్లాప్ కొట్టగా.. ఎన్. శంకర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. పద్మనాభరెడ్డి, రామసత్యనారాయణ స్క్రిప్ట్ అందజేశారు. ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులందరూ చిత్ర మంచి విజయం సాధించాలని కోరారు. తెలుగు, హిందీలలో ద్విభాషా చిత్రంగా రాబోతోన్న ఈ ‘మహా సంద్రం’ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. వారందరి సమక్షంలో మా సినిమా ప్రారంభమవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ప్రస్తుతం కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్‌ని ఎలా షేక్ చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. స్టార్స్ అనే కాకుండా కొత్త తరం నటులు కూడా డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. మా ‘మహా సంద్రం’ సినిమా కూడా అలాంటి జాబితాలోకి చేరుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలం. దర్శకుడు కార్తికేయ వి మంచి కథని సిధ్దం చేశారు. యాక్షన్ డ్రామాగా రాబోతోన్న ఈ సినిమాతో మంచి విజయం అందుకుంటామని ఎంతో నమ్మకంగా ఉన్నాం. ప్రేమ్ రాజ్ ఎనుముల డైలాగ్స్ అందిస్తున్నారు. కళ్యాణ్ సామి కెమెరామెన్‌గా, జగదీష్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. సుభాష్ ఆనంద్ సంగీతం ఈ సినిమాకు మరింత ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నాం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. మరిన్ని వివరాలను త్వరలోనే మీడియాకు తెలియజేస్తామని అన్నారు. టైగర్ శేషు, పెద్ది రాజ్, మళ్లీఖార్జున, ప్రతాప్ చల్లా తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.