Anjali: ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ నుంచి ‘రెంట్‌కి డబ్బు లేదు...’ పాట విడుదల
ABN , Publish Date - Mar 06 , 2024 | 06:57 PM
అంజలి 50వ సినిమాగా వస్తున్న 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' ఏప్రిల్ 11 న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఈరోజు ఒక పాటని విడుదల చేశారు. ఈ సినిమా ఇంతకు ముందు వచ్చిన 'గీతాంజలి' కి సీక్వల్ గా వస్తోంది
అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' ఏప్రిల్ 11న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అంజలికి 50వ సినిమా కావటం విశేషం. శివ తుర్లపాటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాకి కథ అందించటమే కాకుండా, నిర్మాణంలో కూడా భాగస్వామి అయ్యారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఈరోజు ఈ సినిమా నుండి 'రెంట్‌కి డబ్బు లేదు.. స్నానానికి సబ్బు లేదు.. సాయంకాలం పబ్బులేదు.. అయినా తగ్గేది లేదు' అనే పాట విడుదల చేశారు. (Lyrical song from Geethanjali Malli Vachindi is released today)
ఈ పాటని శ్రీనివాస్ రెడ్డి, సత్య, షకలక శంకర్ మీద చిత్రీకరించినట్టుగా తెలిసింది. డబ్బు లేకపోవటం వలన వారికి వచ్చిన బాధలేంటి, అనే విషయం తెలియాలంటే మాత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా చూడాల్సిందేనంటున్నారు చిత్ర సమర్పకుడు కోన వెంకట్. ఇంతకు ముందు అంజలి ప్రధాన పాత్రలో నటించిన 'గీతాంజలి' పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ గా ఈ 'గీతాంజలి మళ్లీ వచ్చింది' తీశారు. ఇది హర్రర్ కామెడీ అని తెలుస్తోంది. (Geethanjali Malli Vachindi is Anjali's 50th film)
ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రచారాలు కూడా విరివిగా చెయ్యాలని నిర్ణయించిన క్రమంలో, ఈరోజు ఈ చిత్ర నిర్వాహకులు మేకర్స్ ఈ సినిమా నుంచి ‘రెంట్‌కి డబ్బు లేదు..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ పాటను భాస్కరభట్ల రాయగా, రామ్ మిర్యాల పాడారు.