LYF: తండ్రి ఆరాటం.. కొడుకు పోరాటం 

ABN , Publish Date - Sep 24 , 2024 | 10:17 PM

శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా వస్తున్న సినిమా లైఫ్ (   లవ్ యువర్ ఫాదర్) . మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఏ. రామస్వామి రెడ్డి నిర్మాతలుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది

శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా వస్తున్న సినిమా లైఫ్ (  LYF - లవ్ యువర్ ఫాదర్) . మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఏ. రామస్వామి రెడ్డి నిర్మాతలుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఎస్. పి. చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా, సంధ్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అతి త్వరలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.  

దర్శకుడు పవన్ కేతరాజు మాట్లాడుతూ  "కొడుకు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం మా ఈ లైఫ్ సినిమా. కథ అంతా కాశి బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ శివతత్వాన్ని చూపించే చిన్న ప్రయత్నం చేసాము.  శ్రీహర్ష మొదటి సినిమా అయినా చాలా బాగా నటించాడు. హీరో తండ్రి పాత్రలో ఎస్పి చరణ్ గారు ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యారు. రఘు బాబు గారు, షకలక శంకర్, ప్రవీణ్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. శ్యామ్ కె నాయుడు గారు సినిమాటోగ్రఫీ విజువల్ వండర్ లా ఉంటుంది.  అదేవిధంగా మణిశర్మ గారు ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అన్ని పాటలు చాలా మేలోడి గా ఇచ్చారు. క్లైమాక్స్ మరియు బిజియం కథ కి హైలైట్ . కషిక కపూర్ చాలా బాగా నటించింది" అని అన్నారు.
aaaa.jpg
నిర్మాత అన్నపరెడ్డి రామస్వామి రెడ్డి మాట్లాడుతూ  " ఆరు నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాం. నేటితో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. డైరెక్టర్ పవన్ గారు, సినిమాటోగ్రఫీ శ్యామ్ గారు, మ్యూజిక్ మణిశర్మ గారు చాలా కష్టపడ్డారు. సినిమా ఎక్కువ శాతం కాశీలో షూట్ చేసాం. దైవత్వంతో పాటు తండ్రి కొడుకులు మధ్య ఉన్న బంధాన్ని కూడా చాలా బాగా చూపిస్తున్నాం. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఇష్టపడి నటించారు. మా మూవీ టీమ్ అందరికీ ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. త్వరలో ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం" అన్నారు.

Updated Date - Sep 24 , 2024 | 10:17 PM