రంగాచారి పాత్ర దక్కడం అదృష్టం

ABN , Publish Date - Dec 10 , 2024 | 05:28 AM

మ్యాగీ దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘హరికథ’. రాజేంద్రప్రసాద్‌, శ్రీరామ్‌, దివి, పూజిత పొన్నాడ, మౌనిక రెడ్డి, అర్జున్‌ అంబటి, రుచిర సాధినేని....

మ్యాగీ దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘హరికథ’. రాజేంద్రప్రసాద్‌, శ్రీరామ్‌, దివి, పూజిత పొన్నాడ, మౌనిక రెడ్డి, అర్జున్‌ అంబటి, రుచిర సాధినేని, శ్రీయా కొట్టం, ఉపాశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సిరీస్‌ ఈనెల 13 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవనుంది. ఈ సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘హరికథ’లాంటి గొప్ప స్ర్కిప్ట్‌ రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ చేయాల్సిన రోల్‌ నాకు దక్కడం సంతోషంగా ఉంది. హరికథలు చెబుతూ జీవితాంతం హరి నామస్మరణ చేసే రంగాచారి పాత్రలో కనిపిస్తాను’ అని చెప్పారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగు వెబ్‌సిరీస్‌లలో ఒక స్టాండర్డ్‌ క్రియేట్‌ చేసేలా ‘హరికథ’ ఉంటుంది’ అని అన్నారు.


దర్శకుడు మ్యాగీ మాట్లాడుతూ‘ ఈ స్ర్కిప్ట్‌ చాలా వైవిధ్యమైనది. చాలా పెద్ద స్ర్కిప్ట్‌. యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి సక్సెఫుల్‌గా సిరీస్‌ మీ ముందుకు వచ్చేలా చేశారు’ అని అన్నారు.

Updated Date - Dec 10 , 2024 | 05:28 AM