Love me : లవ్ మీ.. ఓ డిఫరెంట్ ఫిల్మ్
ABN , Publish Date - May 23 , 2024 | 06:24 AM
టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘లవ్ మీ’ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు...

టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘లవ్ మీ’ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. విడుదల నేపథ్యంలో హీరో ఆశిష్ బుధవారం మీడియాకు చిత్ర విశేషాలు వెల్లడించారు.
నేను ఇదివరకు చేసిన సినిమాలకు భిన్నంగా డార్క్ తరహాలో నా పాత్ర ఉంటుంది. ఎవరైనా ఓ పని చేయవద్దని చెబితే మొండిగా అదే పని చేసే పాత్ర అది. ఇందులో యూ ట్యూబర్‌గా నటించాను. అతని దగ్గరకి ఓ దెయ్యానికి సంబంధించిన కథ వస్తుంది. అప్పుడు అతని జీవితంలో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు అరుణ్‌తో మాట్లాడి హీరో పాత్ర ఎలా కనిపించాలనుకుంటున్నారో తెలుసుకుని ఆ రకంగా నటించా
ఈ సినిమాలో ఐదారుగురు హీరోయిన్లు ఉంటారు. అయితే సినిమా మొత్తం వారు కనిపించరు. గెస్ట్‌లా అలా వచ్చి వెళుతుంటారు. ఇందులో వైష్ణవిది దెయ్యం పాత్ర కాదు. దివ్యావతి ఆ పాత్ర పోషించారు. వైష్ణవి మరో కీలక పాత్ర పోషించారు.
ఇందులో నటించడానికి ముందు ‘చంద్రముఖి’, ‘ముని’ వంటి సినిమాలు చాలా చూశాను. ఇందులో హారర్ ఒక భాగం మాత్రమే. మంచి లవ్‌స్టోరీ కూడా ఉంది. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఓ డిఫరెంట్ మూవీ చూశామని ప్రేక్షకులు సంతృప్తి చెందుతారు.
దర్శకుడు అరుణ్ నవలా రచయిత. ఈ కథను ఆయన చెప్పిన తీరు నాకు బాగా నచ్చింది. దెయ్యంతో మాట్లాడడం, రొమాన్స్ చేయడం.. వంటి అంశాలు కొత్తగా అనిపించాయి. పీసీ శ్రీరామ్, కీరవాణి వంటి లెజెండ్స్ మా సినిమాకు పని చేయడం అంగీకరించడం మాకు ప్లస్ పాయింట్. దర్శకుడు కథ చెప్పిన విధంగా తీస్తాడా అని ఆలోచించి, మొదట పదిహేను రోజులు షూటింగ్ చేసి, బాగా వచ్చిందంటే ముందుకు వెళదాం .. అనుకున్నాం. ఆ సీన్స్ బాగా రావడంతో ప్రొసీడ్ అయ్యాం.
ఈ సినిమా తర్వాత సెల్ఫిష్ ఉంటుంది. ఆ తర్వాత సితార బేనర్‌లో ఓ సినిమా చేయబోతున్నా.