ప్రేమోత్సవం
ABN , Publish Date - Aug 21 , 2024 | 01:28 AM
దిలీప్ ప్రకాశ్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషించిన ‘ఉత్సవం’ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. అర్జున్ సాయి దర్శకత్వంలో సురేశ్ పాటిల్ ఈ సినిమాను...
దిలీప్ ప్రకాశ్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషించిన ‘ఉత్సవం’ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. అర్జున్ సాయి దర్శకత్వంలో సురేశ్ పాటిల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా చిత్రంలోని ‘మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్’ పాటను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ గీతానికి అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలవుతుంది.