Jayaho Ramanuja: ‘జయహో రామానుజ’ లిరికల్ సాంగ్స్ విడుదల

ABN , Publish Date - Jun 22 , 2024 | 08:55 PM

లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్‌లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న విడుదలవుతుండగా.. తాజాగా ఈ చిత్ర లిరికల్ సాంగ్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Jayaho Ramanuja: ‘జయహో రామానుజ’ లిరికల్ సాంగ్స్ విడుదల
Jayaho Ramanuja Songs Launch Event

లయన్ డా. సాయి వెంకట్ (Dr Lion Sai Venkat) నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’ (Jayaho Ramanuja). ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్‌లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా పాటలను తిలకించిన తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లయన్ సాయి వెంకట్‌కు అభినందనలు తెలియజేస్తూ.. పాటలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర లిరికల్ సాంగ్స్ విడుదల కార్యక్రమాన్ని తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. (Jayaho Ramanuja Lyrical Songs)

Also Read-Jr NTR: తారక్‌ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూశారా?

ఈ కార్యక్రమంలో దర్శకుడు, హీరో డా.లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ.. ఇటీవల మా ‘జయహో రామానుజ’ సినిమా పాటలను మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చూపించడం జరిగింది. వారు పాటలన్నీ తమకు బాగా నచ్చాయంటూ ప్రశంసిస్తూ ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా లిరికల్ సాంగ్స్ రిలీజ్ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా ఈవెంట్‌కు వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రంలోని పాటల రూపకల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. సంగీత సాహిత్యాలు గొప్పగా ఉండాలని ఎంతో టైమ్ తీసుకుని ఖర్చుకు వెనకాడకుండా సాంగ్స్ డిజైన్ చేశాం. మహిళల్ని గౌరవించాలని, కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో మానవాళి ఉండాలని సందేశాన్ని ఇచ్చిన గొప్ప గురువు భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారు. ఆయన గొప్పదనం ఈ తరం వారికి తెలియాలనే ఉద్దేశంతో జయహో రామానుజ చిత్రాన్ని రూపొందించాను. జయహో రామానుజ చిత్రంతో ఆయన గొప్పదనం తెలియజేయాలని సంకల్పించాను. జయహో రామానుజ సినిమా రూపకల్పనకు రెండేళ్ల సమయం పట్టింది. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని అన్నారు.


Jayaho-Ramanuja.jpg

నిర్మాత ప్రవళ్లిక (దర్శకుడు, హీరో డా.లయన్ సాయి కుమార్తె) మాట్లాడుతూ.. ఈ సినిమా పాటలన్నీ అందరికీ నచ్చాయని నమ్ముతున్నాం. నాన్న సినిమా కోసం ఎంత శ్రమించారో ఈ పాటలు అందంగా తీసుకొచ్చేందుకు అంతే జాగ్రత్తలు తీసుకున్నారు. ‘జయహో రామానుజ’ సినిమా నాన్నగారికి ఒక డ్రీమ్. ఈ సినిమా చిత్రీకరణలో పిల్లలుగా మమ్మల్ని కూడా భాగస్వాములను చేశారు. భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. అందరూ ఆదరించి ఘన విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాత ప్రసన్న కుమార్, దర్శకుడు వీరశంకర్, ఎఫ్‌డీసీ మాజీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం వంటి వారు మాట్లాడుతూ.. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.

Lion-Sai-Venkat.jpg

Read Latest Cinema News

Updated Date - Jun 22 , 2024 | 08:55 PM